Dhurandhar 2 AP, TG Box Office: షాకింగ్‌గా ధురంధర్ 2 కలెక్షన్లు.. ఉస్తాద్ భగత్ సింగ్ దెబ్బతో..
అత్యంత ప్రేక్షకాదరణతో 2026 సంవత్సరంలో అత్యధిక మంది ఎదురు చూసిన చిత్రం ధురంధర్ ది రివేంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్రను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమాను హిందీ,తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్, హిందీ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం వసూళ్ల తుఫాన్ మొదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ధురంధర్ సినిమా తెలుగు వెర్షన్ సినిమాకు అడ్వాన్స్ విషయంలో భారీ స్పందన కనిపించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా షోలు క్యాన్సిల్ కావడంతో మూవీ కలెక్షన్లపై భారీ ప్రభావం చూపించింది. ప్రీమియర్ల వసూళ్లు విషయంలో భారీగా తేడా కొట్టింది. అయితే ఆ తర్వాత కూడా తెలుగు వెర్షన్ కంటే ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీలోనే చూసేందుకు ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారనే విషయం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్స్ డిస్ట్రిక్ట్, బుక్ మై షో యాప్ ద్వారా స్పష్టమైంది.

ప్రీమియర్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 25 పట్టణాల్లో 30 ప్రాంతాల్లో 30 స్క్రీన్లలో షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీమియర్లకు 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. కానీ షోలు క్యాన్సిల్ కావడంతో ఆ డబ్బును దాదాపు వాపస్ చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు వెర్షన్ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాదాపు 100 లోకేషన్లలో 200 కుపైగా షోలను ప్రదర్శించగా.. సుమారుగా 50 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ సినిమా సుమారుగా 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 50 లక్షల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవరాల్‌గా హిందీ, తెలుగు వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా భారీగానే వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి సంబంధించి 1200 షోలు ప్రదర్శించారు. దాదాపు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. దాంతో ఈ సినిమా ఆంద్రా, నైజాంలో సుమారుగా 4.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రభావం కారణంగా తెలుగు వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబట్టలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే.. ఇండియా వైడ్ ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 145 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు, 175 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అని సాక్ నిక్ డేటా వెల్లడించింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 45 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది అని పేర్కొన్నారు. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగరాసేందుకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications

















