Dhurandhar The Revenge Day 1 Collections: ధురంధర్ 2 బాక్సాఫీస్ ఊచకోత.. రణ్‌వీర్ సింగ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీమియర్ వసూళ్లు ఎంత? తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 సినిమాను భారీ సెట్స్ వేసి పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాన్ని క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి సుమారుగా 30 కోట్ల రూపాయలను ప్రమోషనల్ కోసం ఖర్చు చేశారు. దాంతో పార్ట్ 2 బడ్జెట్ 280 కోట్ల రూపాయల మేర అయింది. ధురంధర్ 1 సినిమామకు 250 కోట్ల రూపాయలు అయిన విషయం తెలిసిందే.
ధురంధర్ 2 సినిమాపై ఊహించని క్రేజ్ ఉండటంతో రికార్డు స్థాయిలో సినిమాను రిలీజ్ చేశారు. ఇండియాలో ఈ సినిమాను సుమారుగా 8500 నుంచి 9000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా 12000 వేల స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు సమాచారం. ఇండియాలో 13 వేల పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శించారు. తొలి రోజు సుమారుగా 9 వేల షోలు ప్రదర్శిస్తున్నట్టు తెలిసింది.
ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్ 100 కోట్లకుపైగా వసూలు చేసింది. పెయిర్ ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు విషయానికి వస్తే ఇండియాలో 90 కోట్లకుపైగా నెట్, 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది. పాజిటివ్ టాక్ ఉన్నందున్న ఈ వసూళ్ల రేంజ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ఊచకోతను కొనసాగిస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి రోజు ముగిసే సమయానికి 3 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్ మొత్తం 40 కోట్ల రూపాయల నెట్, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 225 నుంచి 250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్ట వచ్చని అంచనా వేస్తున్నారు.
ధురంధర్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా ముందు తేలికైన లక్ష్యం కనిపిస్తున్నది. ఈ సినిమా 280 కోట్ల రూపాయల నెట్, 500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా తొలి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అవ్వోచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











