Dhurandhar 2 Day 1 Box Office: ధురంధర్ 2 రికార్డు ఓపెనింగ్స్.. ప్రభాస్‌కు మించి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు, తొలి రోజు వసూళ్ల అంచనా వివరాల్లోకి వెళితే..

Dhurandhar 2 Day 1 Box Office

ధురంధర్ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. పాకిస్థాన్ నేపథ్యంగా సాగే ఈ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో భారీ సెట్స్ వేసి మరో పాకిస్థాన్‌ను క్రియేట్ చేశారు. ఈ సినిమా రెండు భాగాలకు కలిపి మొత్తంగా 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమాను అదిత్య ధార్ రూపొందించారు. ఈ సినిమా పార్ట్ 1 ఇప్పటికే 1400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా రెండో భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా అంటే.. సుమారుగా 100000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Also Read
OG Vs UBS Day 1 Box Office: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత? OG రికార్డును బ్రేక్ చేస్తుందా?
OG Vs UBS Day 1 Box Office: ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే టార్గెట్ ఎంత? OG రికార్డును బ్రేక్ చేస్తుందా?

ధురంధర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవల ప్రారంభించగా.. అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు మార్చి 18వ తేదీన ప్రదర్శించే పెయిడ్ ప్రివ్యూల రూపంలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 70 కోట్ల రూపాయల మేర నమోదు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Recommended For You
Dhurandhar The Revenge Critic Review: ధురంధర్ ది రివెంజ్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
Dhurandhar The Revenge Critic Review: ధురంధర్ ది రివెంజ్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్

ధురంధర్ 2 సినిమాకు నార్త్ మాత్రమే కాకుండా సౌత్‌లో కూడా భారీ ఆదరణ కనిపిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ పీవీఆర్, సినీ పోలీస్ ఇతర థియేటర్లలో కలిపి సుమారుగా 1.25 లక్షల టికెట్లను అమ్మడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 3 రోజుల వ్యవధి ఉండటంతో ఈ రేంజ్ పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.

You May Also Like
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ దుబాయ్ సెన్సార్ రివ్యూ
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ దుబాయ్ సెన్సార్ రివ్యూ

ధురంధర్ 2 సినిమాకు వస్తున్న ఆదరణ, అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చూస్తే రికార్డు కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను, 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా క్రేజ్ చూస్తే ఇంకా భారీగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అని చెబుతున్నారు.

'శృంగారంలో ఆ తప్పుతో ప్రెగ్నెన్సీ.. బలవంతంగా పెళ్లి’
'శృంగారంలో ఆ తప్పుతో ప్రెగ్నెన్సీ.. బలవంతంగా పెళ్లి’

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ ిచత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో 4 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 36 కోట్లకుపైగా కలెక్షన్లు, ఓవర్సీస్‌లో 5 మిలియన్ డాలర్లు అంటే 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 200 నుంచి 225 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ వసూలు చేసిన కలెక్షన్ల రికార్డును సునాయాసంగా బ్రేక్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X