Dhurandhar 2 Day 10 Collections: ‘ధురంధర్ 2' దండయాత్ర.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా, అతి తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్లతో రికార్డుల పరంపర సృష్టిస్తోంది. ముఖ్యంగా అత్యంత వేగంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలిచి, మరోసారి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో తన ముద్ర వేసింది. ఈ చిత్రం గత 9 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 10వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..

దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, నార్త్-సౌత్ అన్న తేడా లేకుండా అన్ని మార్కెట్లలో దుమ్మురేపుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రతి సెంటర్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు వెర్షన్ రెండు రోజుల ఆలస్యంగా రిలీజ్ అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించడం విశేషం.

Dhurandhar The Revenge Day 10 Expected Box Office Collections Ranveer Singh movie towards 1200 Crores

జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు ఆదిత్య ధార్ నేతృత్వంలో లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా 'ధురంధర్ 2'ను నిర్మించారు. రణవీర్ సింగ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ, శివకుమార్ పానికర్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 19న పలు భాషల్లో విడుదలై అన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణ పొందింది. తెలుగు వెర్షన్ ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులు భారీగా ఆదరించారు.

ఇండియా మార్కెట్‌లో ఈ సినిమా తొలి వీకెండ్ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టింది. రోజువారీ కలెక్షన్ల పరంగా చూస్తే, ఈ సినిమా స్టార్ట్ నుంచే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ. 43 కోట్లు, తొలి రోజు రూ. 102.55 కోట్లు, రెండో రోజు రూ. 80.72 కోట్లు, మూడో రోజు రూ. 113 కోట్లు, నాలుగో రోజు రూ. 114.85 కోట్లు రాబట్టింది. తర్వాత కూడా స్టెడీగా కలెక్షన్లు కొనసాగిస్తూ ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరో రోజు రూ.56.55 కోట్లు, ఏడో రోజు రూ.48.25 కోట్లు, ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ. 41.55 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 466 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

మొత్తం 9 రోజుల ముగిసే సరికి, ఈ సినిమా ఇండియాలో రూ.715.72 కోట్ల నెట్, రూ. 855 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో కూడా అదిరిపోయే రన్ కొనసాగిస్తూ రూ. 274 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు రూ.1,141 కోట్లను దాటాయి. ఇందులో హిందీ వెర్షన్ నుంచే రూ. 633 కోట్లకు పైగా రావడం ఈ మూవీకి ఉన్న భారీ డిమాండ్‌ను చూపిస్తోంది. తెలుగు మార్కెట్‌లో కూడా రూ. 23 కోట్లకు పైగా వసూలు చేసి మంచి స్థాయిలో రాణిస్తోంది. ఈ సినిమాను సుమారు రూ. 280 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి భారీ లాభాల్లోకి వెళ్లిన ఈ సినిమా, ఇప్పుడు ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.

ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 10వ రోజు అయిన శనివారం రికార్డు స్థాయిలో వసూలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. నేడు వీకెండ్ కాబట్టి ఈ సినిమా రూ.45నుంచి రూ.50 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. 'ధురంధర్ 2' అతి త్వరలోనే రూ. 1200 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 'బాహుబలి 2', 'పుష్ప 2', 'జవాన్' వంటి భారీ చిత్రాల రికార్డులను టార్గెట్ చేస్తున్న ఈ సినిమా, చివరికి ఎక్కడ ఆగుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి.. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే కాకుండా బాలీవుడ్ చరిత్రలో కూడా 'ధురంధర్ 2' ఒక మైలురాయిగా నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X