Dhurandhar 2 Day 11 Collections: ‘ధురంధర్ 2' జైత్రయాత.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Dhurandhar The Revenge Box Office: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, అతి తక్కువ సమయంలోనే భారీ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మరోసారి ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 10 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 11వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..
దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను Jio Studios , B62 Studios బ్యానర్లపై ప్రదర్శించిన ఈ లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు నిర్మించారు. రణవీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్ పాత్రలో నటించగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రలు పోషించారు. టెక్నికల్‌గా కూడా సినిమా హై స్టాండర్డ్స్‌తో రూపొందించబడింది. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ, శివకుమార్ పానికర్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన సంగీతం మరింత గ్రిప్‌ను తీసుకొచ్చింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాన్-ఇండియా లెవెల్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ధురంధర్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.43 కోట్ల భారీ ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా, మొదటి రోజే రూ.102.55 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్ల వసూళ్లతో మొదటి నాలుగు రోజుల్లోనే బ్లాక్‌బస్టర్ గా మారింది. ఆ తర్వాత వీక్ డేస్ లో కూడా అదే జోరు కొనసాగింది. ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరో రోజు రూ.56.55 కోట్లు, ఏడో రోజు రూ.48.25 కోట్లు వసూలు చేసింది.
రెండో వీకెండ్‌లో మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.55 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు అందుకుంటుంది. ఈ విధంగా ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి మొత్తం రూ.674 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక 10 రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1,226.44 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో ఇండియా గ్రాస్ సుమారు రూ.930.44 కోట్లు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.296 కోట్లు రాబట్టింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను దాటి భారీ లాభాల్లోకి ప్రవేశించిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్తోంది.
ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, వీకెండ్ క్రేజ్ కారణంగా 11వ రోజు (ఆదివారం) ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ జోరు చూపించే అవకాశముంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద సంఖ్యలో రావడం వల్ల కలెక్షన్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. సాక్నిల్క్ ట్రాకింగ్ ప్రకారం.. 11వ రోజు ఈ సినిమా రూ.65 నుంచి రూ.75 కోట్ల మధ్య వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.780 కోట్లు (గ్రాస్)మార్క్‌ను దాటే అవకాశం ఉంది. ఇదే జోరు కొనసాగితే సోమవారం నాటికే రూ.800 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే 11వ రోజు కలెక్షన్ల పరంగా పాత రికార్డులను అధిగమిస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా నేడు రూ.1200 కోట్ల మార్క్‌ను కూడా దాటే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లక్ష్యం భారీ రికార్డులే. బాహుబలి 2, పుష్ప 2, జవాన్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల కలెక్షన్లను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ జోరు చూస్తుంటే ఫైనల్‌గా ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా రణవీర్ సింగ్ కెరీర్‌లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మైలుస్టోన్ మూవీగా మారే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications



















