Dhurandhar 2 Day 12 Collections: ‘‘ధురంధర్ 2' కలెక్షన్స్ సునామీ .. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: ఇండియన్ సినీ పరిశ్రమలో 'ధురంధర్ 2' బాక్సాఫీస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రెండో వారం కూడా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అదే జోష్‌తో కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా నిలువగా, తాజాగా ధురంధర్ పార్ట్ 1 రికార్డు బ్రేక్ చేసిన మూవీగా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 11 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 12వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేయబోతుంది? అనే వివరాల్లోకి వెళితే..

ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రధాన బలం కాగా, దర్శకుడు ఆదిత్య ధర్ కథను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను థ్రిల్ చేసింది. Jio Studios, B62 Studios బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమాలో సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, R. మాధవన్ కీలక పాత్రల్లో కనిపించారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌తో రూపొందించబడింది. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ, శివకుమార్ పానికర్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత గ్రిప్ తీసుకొచ్చింది.

Dhurandhar The Revenge Day 12 Expected Box Office Collections Worldwide Ranveer Singh movie towards 1400 Crores

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.43 కోట్ల భారీ ఓపెనింగ్ అందుకుంది. మొదటి రోజే రూ.102.55 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా తర్వాతి రోజుల్లో కూడా అదే జోరు కొనసాగింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లతో మొదటి నాలుగు రోజుల్లోనే బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను అందుకుంది.

వీక్‌డేస్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్లు బలంగానే ఉన్నాయి. ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరో రోజు రూ.56.55 కోట్లు, ఏడో రోజు రూ.48.25 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో వీకెండ్‌లో మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.55 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు. 11వ రోజు కూడా తగ్గకుండా రూ.68.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడం ఈ సినిమా స్టామినాను చూపిస్తోంది.

తాజా లెక్కల ప్రకారం, కేవలం 11 రోజుల్లోనే ఇండియాలో ఈ సినిమా రూ.846.87 కోట్ల నెట్, రూ.1,011.95 కోట్ల గ్రాస్ వసూళ్లను కలిగి ఉంది. ఇదే సమయంలో ఓవర్స్ మార్కెట్‌లో కూడా భారీ స్పందన లభించింది. విదేశాల్లో ఇప్పటికే రూ.342 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1,353 కోట్ల గ్రాస్‌ను చేరుకుంది. ముఖ్యంగా, గతంలో వచ్చిన 'ధురంధర్' మొదటి భాగం లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను ఈ సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే దాటేయడం విశేషంగా మారింది.

ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, వీకెండ్ క్రేజ్ కారణంగా 12వ రోజు ( సోమవారం) ఈ సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. వీక్ డే కాబట్టి థియేటర్ ఆక్యూపెనీ కాస్త తగ్గుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సాక్నిల్క్ ట్రాకింగ్ ప్రకారం.. 12వ రోజు ఈ సినిమా రూ.40 నుంచి రూ.45 కోట్ల మధ్య వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని చెబుతుంది. దీంతో మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1050 కోట్లు (గ్రాస్)మార్క్‌, ప్రపంచవ్యాప్తంగా రూ.1,400 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉంది.

ఇదే జోరు కొనసాగితే రెండు వారాల్లో బాహుబలి 2, పుష్ప 2 టోటల్ కలెక్షన్స్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. 'ధురంధర్ 2' కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు... బాక్సాఫీస్‌ను శాసిస్తున్న పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X