Dhurandhar 2 Day 13 Collections: ‘ధురంధర్ 2' దూకుడు త‌గ్గిందా ? రణ్‌వీర్ మూవీకి 13 వ రోజు ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అదే జోష్‌ను కొనసాగిస్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం, రోజురోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది 'ధురంధర్ 2'. ఇక తాజాగా ధురంధర్ పార్ట్ 1' లైఫ్‌టైమ్ కలెక్షన్లను అధిగమించి మరో అరుదైన ఘనతను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 12 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 13వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేయబోతుంది? అనే వివరాల్లోకి వెళితే..

ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ నటనతో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. దర్శకుడు ఆదిత్య ధర్ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తూ థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తోంది. Jio Studios, B62 Studios సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో మెప్పించారు. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌తో రూపొందింది. వికాస్ నౌలఖ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్‌గా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, శివకుమార్ పానికర్ ఎడిటింగ్ కథను కట్టుదిట్టంగా నడిపించింది. శాశ్వత్ సచ్‌దేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చింది.

Dhurandhar The Revenge Day 13 Expected Box Office Collections Worldwide Ranveer Singh movie towards 1500 Cr Worldwide

రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత దూకుడుతో కొనసాగుతోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, రిలీజ్‌కు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.43 కోట్ల భారీ ఓపెనింగ్ అందుకుని ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజే రూ.102.55 కోట్ల వసూళ్లతో హిందీ సినిమా చరిత్రలోనే ఒక భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం, తర్వాతి రోజుల్లో కూడా అదే జోరు కొనసాగిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లతో కేవలం నాలుగు రోజుల్లోనే బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను సంపాదించింది.

సాధారణంగా వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గడం సహజం అయినప్పటికీ, ఈ సినిమాకి మాత్రం ఎక్కడా పెద్దగా డ్రాప్ కనిపించలేదు. ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరో రోజు రూ.56.55 కోట్లు, ఏడో రోజు రూ.48.25 కోట్లతో స్టెడీ కలెక్షన్లు నమోదు చేసి మొదటి వారం మొత్తం రూ.674 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఈ సినిమా అదే జోష్ కొనసాగించింది. ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.55 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు వసూలు చేయగా, 11వ రోజు రూ.68.10 కోట్లతో మరోసారి భారీ జంప్ చూపించింది.

ఇది సినిమా పై ఉన్న డిమాండ్ ఇంకా తగ్గలేదనే సంకేతాన్ని ఇచ్చింది. 12వ రోజు కూడా రూ.25 కోట్లకు పైగా వసూలు చేయడంతో, వీక్‌డేస్‌లో కూడా ఈ సినిమా స్టామినా స్పష్టంగా కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం, కేవలం 12 రోజుల్లోనే 'ధురంధర్ 2' ఇండియాలో రూ.877.14 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ.1,042.23 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దూసుకెళ్తూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1,392 కోట్ల గ్రాస్‌ను అందుకుని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ముఖ్యంగా, గతంలో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను ఈ సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే అధిగమించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక 13వ రోజు (మంగళవారం) కలెక్షన్లపై ట్రేడ్ వర్గాలు ఆసక్తికర అంచనాలు వేస్తున్నాయి. వీక్ డే కావడంతో థియేటర్ ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సినిమా పై ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్లు పూర్తిగా పడిపోవని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్నిల్క్ ట్రాకింగ్ ప్రకారం, 13వ రోజు ఈ చిత్రం రూ.25 నుంచి రూ.30 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం గ్రాస్ రూ.1070 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, చాలా త్వరలోనే ఈ సినిమా ఇండియాలో రూ.900 కోట్ల నెట్ మార్క్‌ను కూడా దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా రూ.1,420 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించే దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది.

ఇప్పటికే 'ధురంధర్: ది రివెంజ్' ఉత్తర అమెరికాలో రూ.22.7 మిలియన్ డాలర్లను దాటి, ప్రభాస్ 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది. అయితే.. ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు కారణంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశముందని తెలుస్తోంది. మొత్తంగా, ఇది సాధారణ హిట్ కాదు.. గ్లోబల్ రేంజ్‌లో రికార్డులు తిరగరాస్తున్న బ్లాక్‌బస్టర్. ఇప్పుడు రూ.1500 కోట్ల మార్క్ చేరుతుందా? అన్నదే హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X