Dhurandhar 2 Day 14 Collections: 1500 కోట్ల దిశగా ధురంధర్ 2.. రణ్‌వీర్ మూవీకి 14వ రోజు ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: ధురంధర్ ది రివెంజ్ ఇండియన్ బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన రెండు వారాలు పూర్తవుతున్నా, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ జోరు ఏమాత్రం తగ్గకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమాగా నిలిచిన 'ధురంధర్ 2', ఇప్పుడు మరిన్ని అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల ఈ చిత్రం 'ధురంధర్' మొదటి భాగం లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా అధిగమించడం మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 13 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 14వ రోజు ఏ మేరకు వసూళ్లను కలెక్ట్ చేయబోతుంది? అనే వివరాల్లోకి వెళితే..

Dhurandhar The Revenge Day 14 Expected Box Office Collections Ranveer Singh movie towards 1500 Cr Worldwide

సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ, మొదటి భాగం కంటే భారీ స్థాయిలో సక్సెస్ సాధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా, ప్రేక్షకాదరణలో కూడా ఈ సినిమా ముందంజలో నిలవడం. ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రధాన బలం అయ్యాడు. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్ కథను హై వోల్టేజ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించి థ్రిల్లింగ్ అనుభూతిని అందించాడు.

ఇందులో సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటీనటులు పాత్రల్లో మెప్పించారు. ప్రతి పాత్రకూ కథలో ప్రాధాన్యత ఉంటే మరింత బలం చేకూర్చింది. టెక్నికల్‌గా కూడా 'ధురంధర్ 2' అత్యున్నత ప్రమాణాలతో రూపొందించబడింది. వికాస్ నౌలఖ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను గ్రాండ్‌గా చూపించగా, శివకుమార్ పాణికర్ ఎడిటింగ్ కథను కట్టుదిట్టంగా నడిపించింది. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు అదనపు ఉత్కంఠను అందించింది.

'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహత దూకుడుతో కొనసాగుతోంది. తొలి రోజు నుంచే ఈ సినిమా రికార్డుల వేట ప్రారంభించింది. ప్రీమియర్ షోల ద్వారా రూ.43 కోట్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజే రూ.102.55 కోట్లతో హిందీ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లు వసూలు చేసి ఓపెనింగ్ వీకెండ్‌ను భారీ స్థాయిలో ముగించింది. ఆ తరువాత కూడా కలెక్షన్లలో పెద్దగా పడిపోకుండా ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరవ రోజు రూ.56.60 కోట్లు, ఏడో రోజు రూ.48.75 కోట్లు రాబట్టి, మొదటి వారంలోనే రూ.674.17 కోట్ల రికార్డు కలెక్షన్లు సాధించింది.

రెండో వారంలో కూడా ఈ సినిమా అదే స్పీడ్ కొనసాగించింది. ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.75 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు, పదకొండో రోజు రూ.68.10 కోట్లు వసూలు చేసి మళ్లీ భారీ రేంజ్ చూపించింది. తర్వాత పన్నెండో రోజు రూ.25.30 కోట్లు, పదమూడు రోజు రూ.27.75 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ.903.22 కోట్లకు చేరాయి.

తాజా లెక్కల ప్రకారం, కేవలం 13 రోజుల్లోనే 'ధురంధర్ 2' ఇండియాలో రూ.900 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ.1,077.41 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దూసుకెళ్తూ ఇప్పటికే రూ.358 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1,435.41 కోట్ల గ్రాస్‌ను అందుకుని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇందులో హిందీ వర్షన్ నుంచి దాదాపు రూ. 850 కోట్ల వరకు వసూలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో గతంలో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను ఈ సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే అధిగమించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక 14వ రోజు (బుధవారం) కలెక్షన్లపై ట్రేడ్ వర్గాలు ఆసక్తికర అంచనాలు వేస్తున్నాయి. వీక్ డే కావడంతో థియేటర్ ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సినిమా పై ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్లు పూర్తిగా పడిపోవని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్నిల్క్ ట్రాకింగ్ ప్రకారం, 14వ రోజు ఈ చిత్రం రూ.25 నుంచి రూ.30 కోట్ల మధ్య వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం గ్రాస్ రూ.1100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే ట్రెండ్ కొనసాగితే, చాలా త్వరలోనే ఈ సినిమా ఇండియాలో రూ.930 కోట్ల నెట్ మార్క్‌ను కూడా దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం రూ.1000 కోట్ల ఇండియా నెట్ మార్క్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా కూడా రూ.1,500కోట్ల గ్రాస్ మార్క్‌ను మరింత చేరువ కానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X