Dhurandhar 2 Day 15 Collections: భారీ లాభాల్లో ధురంధర్ 2... రణ్‌వీర్ మూవీకి 15వ రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే?

ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ విధ్వంసం కొనసాగుతోంది. రెండో వారం ముగిసి త్వరలో మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ రణ్‌వీర్ ఊచకోత ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 1400 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసిన ధురంధర్.. 2000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ మూవీ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు ధురంధర్ 2 ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టింది? 15వ రోజు ధురంధర్ 2 కలెక్షన్స్ ఎంత? ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే‌లు సంయుక్తంగా ధురంధర్ 2 చిత్రాన్ని నిర్మించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. మార్చి 19న ధురంధర్ 2 మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వరల్డ్ వైడ్‌గా రిలీజైంది.

Dhurandhar The Revenge Day 15 Expected Box Office Collections Ranveer Singh movie raked in returns

ధురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటుల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 280 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్.. 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. ఆంధ్రా, నైజాంలలో నిర్మాతలతో పాటు జియో స్టూడియోస్ సంస్థ స్వయంగా ధురంధర్ 2ను రిలీజ్ చేసింది.

ధురంధర్ 2 14 రోజుల కలెక్షన్స్
రణ్‌వీర్ సింగ్ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 43 కోట్ల రూపాయలు, తొలిరోజున 102.55 కోట్ల రూపాయలు, రెండో రోజున 80.72 కోట్ల రూపాయలు, మూడో రోజున 113 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 114.85 కోట్ల రూపాయలు, ఐదో రోజున 65 కోట్ల రూపాయలు, ఆరో రోజున 56.55 కోట్ల రూపాయలు, ఏడో రోజున 48.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 49.70 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 50.34 కోట్ల రూపాయలు, పదో రోజున 62.85 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 68.10 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 25.30 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 27.75 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 20.10 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

మొత్తంగా 14 రోజుల వరకు ధురంధర్ 2 చిత్రం ఇండియాలో 920.02 కోట్ల రూపాయల నెట్.. 1101.47 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ 365 కోట్లు కలిపి వరల్డ్ వైడ్‌గా 1466.47 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటి వరకు హిందీలో 862.79 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.28 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.48 కోట్ల రూపాయలు, తమిళంలో 13.57 కోట్ల రూపాయలు, తెలుగులో 37.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ధురంధర్ 2 ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో ధురంధర్ 2కి 22.7 మిలియన్ డాలర్లు (211 కోట్ల రూపాయలు), జర్మనీలో 1 మిలియన్ యూరోలు (10.73 కోట్ల రూపాయలు), ఆస్ట్రేలియాలో 6.37 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు ( 40.78 కోట్ల రూపాయలు)తో పాటు యూకే, యూరప్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో కలిపి 14 రోజుల వరకు ధురంధర్ 2 మూవీకి ఓవర్సీస్‌లో 365 కోట్లు రూపాయలు రాబట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ధురంధర్ 2 15వ రోజు వసూళ్లు అంచనా
మూడో వారంలోకి అడుగుపెడుతున్నప్పటికీ ధురంధర్ 2 హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఐపీఎల్ హవాలోనూ రణ్‌వీర్ సింగ్ మూవీ మెరుగైన వసూళ్లు రాబడుతుండటం విశేషం. 15వ రోజు ధురంధర్ 2 మూవీకి ఇండియా వైడ్‌గా సాయంత్రం 4 గంటల వరకు 9133 షోలు ప్రదర్శితమై.. 14.3 శాతం మేర ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు ధురంధర్ 2కి ఇండియాలో 5.23 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

15వ రోజు ఈ రణ్‌వీర్ సింగ్ మూవీకి హిందీలో 18 కోట్ల రూపాయలు, మలయాళంలో 15 లక్షల రూపాయలు, కన్నడంలో 5 లక్షల రూపాయలు, తమిళంలో 30 లక్షల రూపాయలు, తెలుగులో 80 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 23 కోట్ల రూపాయలు గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ధురంధర్ 2 ద్వారా నిర్మాతలకు దాదాపు 720 కోట్ల రూపాయలకు పైగా లాభాలు అందినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. థియేట్రికల్ రన్ ముగిసేసరికి రణ్‌వీర్ ఎన్ని కోట్ల లాభాలు అందిస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X