Dhurandhar 2 Day 17 Collections: ఆ రికార్డుపై ధురంధర్ 2 కన్ను.. రణ్‌వీర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలై రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమా ఎక్కడా స్లో అవ్వకపోవడం విశేషం. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం, రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల క్లబ్‌ను దాటేసి, ఇప్పుడు మరింత పెద్ద మైలురాళ్ల వైపు పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 16 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఇక 17వ రోజు ఏ మేరకు వసూలు చేయబోతుంది? అనే వివరాల్లోకి వెళితే..

Also Read
 50 నిద్రమాత్రలతో సూసైడ్ అటెంప్ట్.. ఆ అమ్మాయి వల్లే..
50 నిద్రమాత్రలతో సూసైడ్ అటెంప్ట్.. ఆ అమ్మాయి వల్లే..

మొదటి భాగానికి సీక్వెల్‌గా వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' అంచనాలను మించి భారీ విజయాన్ని సాధించింది. 'ధురంధర్ 1' లైఫ్‌టైమ్ కలెక్షన్లను సులభంగా దాటి, బాక్సాఫీస్‌తో పాటు ప్రేక్షకాదరణలోనూ ముందంజలో నిలిచింది. ఈ విజయానికి రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన కారణంగా నిలిచింది. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు ఆదిత్య ధర్ హై వోల్టేజ్ స్క్రీన్‌ప్లేతో కథను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దగా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా కూడా సినిమా మెప్పించింది. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ, శివకుమార్ పాణికర్ ఎడిటింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని కలిసి సినిమాను మరింత గ్రాండ్‌గా నిలబెట్టాయి.

Dhurandhar The Revenge Day 17 Expected Box Office Collection Ranveer Singh movie in 1550 Cr club
Recommended For You
ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. ప్రభాస్‌పై శర్వా ఓపెన్ కామెంట్స్
ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. ప్రభాస్‌పై శర్వా ఓపెన్ కామెంట్స్

ఇక కలెక్షన్ల పరంగా చూస్తే.. రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతూ సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా రికార్డుల వేట ప్రారంభించింది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.43 కోట్ల వసూళ్లు సాధించి, ఓపెనింగ్ హైప్‌ను స్పష్టంగా చూపించింది. అనంతరం ఫస్ట్ డేనే రూ.102.55 కోట్లతో హిందీ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేయడం విశేషం. ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ సినిమా వసూళ్ల పరంగా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లు వసూలు చేస్తూ నాలుగు రోజుల్లోనే భారీ మైలురాయిని అందుకుంది.

You May Also Like
పెళ్లైన క్రేజ్‌ అసలు తగ్గట్లేదుగా.. రష్మిక ఖాతాలో మరో అరుదైన రికార్డు
పెళ్లైన క్రేజ్‌ అసలు తగ్గట్లేదుగా.. రష్మిక ఖాతాలో మరో అరుదైన రికార్డు

వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్లలో పెద్దగా పడిపోకుండా ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరవ రోజు రూ.56.60 కోట్లు, ఏడో రోజు రూ.48.75 కోట్లు రాబట్టి మొదటి వారాంతానికి రూ.674.17 కోట్ల నెట్ వసూళ్లతో అద్భుత రికార్డు సృష్టించింది. రెండో వారంలో కూడా ఈ చిత్రం అదే జోష్ కొనసాగించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.75 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు, పదకొండో రోజు రూ.68.10 కోట్లు వసూలు చేస్తూ మళ్లీ భారీగా రాణించింది. అనంతరం పన్నెండో రోజు రూ.25.30 కోట్లు, పదమూడు రోజు రూ.27.75 కోట్లు, పద్నాలుగో రోజు రూ.20.10 కోట్లు, 15వ రోజు 18.30 కోట్ల, 16 రోజు 21.55 కోట్ల నెట్ వసూళ్లు సాధించడం గమనార్హం.

Biker Movie Day 2 collections: షాకింగ్ గా బైకర్ కలెక్షన్స్ ..శర్వా మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?
Biker Movie Day 2 collections: షాకింగ్ గా బైకర్ కలెక్షన్స్ ..శర్వా మూవీకి 2వ రోజు ఎన్ని కోట్లంటే?

వీక్‌డేస్‌లో కూడా స్ట్రాంగ్ కలెక్షన్లు అందుకోవడం ఈ సినిమా స్టామినాను స్పష్టంగా తెలియజేస్తోంది. మొత్తంగా చూస్తే, మొదటి వారం రూ.674.17 కోట్లు, రెండో వారం రూ.263.65 కోట్లు అందుకుంది. ఇక ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.959.37 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలోనే రూ.1,148.58 కోట్లు అందుకుంది. వర్సీస్ మార్కెట్‌లో కూడా 'ధురంధర్: ది రివెంజ్' అదే స్థాయిలో ప్రభావం చూపుతోంది. 16వ రోజు విదేశాల్లో రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లను రూ.375 కోట్లకు చేర్చుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ స్పందన లభించడం విశేషం. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1,523.58కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

Ramayana OTT Deal: 'వారాణాసి'ని మించిన రికార్డు డీల్.. నో చెప్పిన 'రామాయణ' మేకర్స్.. ఎందుకో తెలుసా?
Ramayana OTT Deal: 'వారాణాసి'ని మించిన రికార్డు డీల్.. నో చెప్పిన 'రామాయణ' మేకర్స్.. ఎందుకో తెలుసా?

ఇక 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను సెట్ చేస్తోంది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.43 కోట్ల వసూళ్లు సాధించింది.ఫస్ట్ డేనే రూ.102.55 కోట్లతో హిందీ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించింది. ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లు రాబట్టుతూ కేవలం నాలుగు రోజుల్లోనే భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది.

ఈ జోరు వీకెండ్ తర్వాత కూడా తగ్గలేదు. ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరవ రోజు రూ.56.60 కోట్లు, ఏడో రోజు రూ.48.75 కోట్లు వసూలు చేసి, మొదటి వారంలోనే రూ.674.17 కోట్ల నెట్ కలెక్షన్లతో అరుదైన రికార్డు నెలకొల్పింది. రెండో వారంలో కూడా ఈ సినిమా అదే స్పీడ్ కొనసాగించడం విశేషం. ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.75 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు, పదకొండో రోజు రూ.68.10 కోట్లు వసూలు చేస్తూ మళ్లీ భారీ రేంజ్ చూపించింది. ఆ తర్వాత కూడా వసూళ్లు స్థిరంగా కొనసాగాయి.

నీ సైజు ఎంతో చెప్పు.. నెటిజన్‌కు స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై
నీ సైజు ఎంతో చెప్పు.. నెటిజన్‌కు స్టార్ హీరోయిన్ షాకింగ్ రిప్లై

పన్నెండో రోజు రూ.25.30 కోట్లు, పదమూడు రోజు రూ.27.75 కోట్లు, పద్నాలుగో రోజు రూ.20.10 కోట్లు, 15వ రోజు రూ.18.30 కోట్లు, 16వ రోజు రూ.21.55 కోట్లు రాబట్టి వీక్‌డేస్‌లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. మొత్తంగా చూస్తే, రెండు వారాల్లో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.959.37 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, గ్రాస్ పరంగా రూ.1,148.58 కోట్లను దాటింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఇదే జోరు కొనసాగుతోంది. 16వ రోజు విదేశాల్లో రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లను రూ.375 కోట్లకు చేర్చుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం రూ.1,523.58 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.

ఎన్టీఆర్ సినిమాలో 'ధురంధర్ 2' విలన్.. ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా..
ఎన్టీఆర్ సినిమాలో 'ధురంధర్ 2' విలన్.. ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా..

ఇక ఇప్పుడు అందరి దృష్టి 17వ రోజు కలెక్షన్లపై ఉంది. వీకెండ్ ప్రారంభం కావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే 5,800కు పైగా స్క్రీన్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం మళ్లీ పీక్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంచనాల ప్రకారం 17వ రోజు రూ.40 నుంచి రూ.45 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించే అవకాశముంది. అలా జరిగితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1000 కోట్ల నెట్ మైలురాయిని దాటే రెండో సినిమాగా నిలవనుంది. ఇప్పటికే ఈ రికార్డును అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సాధించిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా త్వరలోనే రూ.1550 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X