Dhurandhar 2 Day 18 Collections: ఆ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో.. ధురంధర్ 2 కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

Dhurandhar The Revenge Box Office: రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలై రెండు వారాలు గడిచినా ఈ సినిమా కలెక్షన్ల వేగం ఎక్కడా తగ్గకుండా దూసుకుపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా , రోజురోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తూ ఇప్పటికే రూ.1500 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఇప్పుడు మరింత మైల్ స్టోన్స్ ను క్రాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా సినిమా గత 17 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఇక 18వ రోజు ఏ మేరకు వసూలు చేయబోతుంది? అనే వివరాల్లోకి వెళితే..

ధురంధర్ మొదటి భాగానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి ఘన విజయాన్ని అందుకుంది. 'ధురంధర్' మొదటి పార్ట్ లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా సులభంగా అధిగమించి, సీక్వెల్‌గా మరింత భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విజయానికి ప్రధాన కారణం రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపిన ఇన్టెన్సిటీ, ఎమోషనల్ సీన్స్‌లో ప్రదర్శించిన నటన ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలం చేకూర్చింది.

Dhurandhar The Revenge Day 18 Expected Box Office Collection Ranveer Singh movie towards to 1600 Crores club

దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాను హై వోల్టేజ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించి ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠభరితంగా మలిచారు. కథనం వేగంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరోవైపు సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి నటీనటులు తమ తమ పాత్రల్లో మెప్పించి సినిమాకు మరింత విలువను తీసుకువచ్చారు. టెక్నికల్ అంశాల పరంగా కూడా 'ధురంధర్: ది రివెంజ్' అగ్రస్థాయిలో నిలిచింది. వికాస్ నౌలఖ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను గ్రాండ్‌గా చూపించగా, శివకుమార్ పాణికర్ ఎడిటింగ్ సినిమా నేరేషన్‌ను షార్ప్‌గా ఉంచింది. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను మరింత ఎలివేట్ చేసింది.

ఇక కలెక్షన్ల పరంగా 'ధురంధర్: ది రివెంజ్' నిజంగానే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజునుంచే ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.43 కోట్ల భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా, ఫస్ట్ డేనే రూ.102.55 కోట్లతో హిందీ సినీ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించి సంచలనం సృష్టించింది. ఓపెనింగ్ వీకెండ్‌లో ఈ మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగింది. రెండో రోజు రూ.80.72 కోట్లు, మూడో రోజు రూ.113 కోట్లు, నాలుగో రోజు రూ.114.85 కోట్లు రాబట్టుతూ కేవలం నాలుగు రోజుల్లోనే భారీ రేంజ్‌ను టచ్ చేసింది.

వీకెండ్ తర్వాత కూడా ఈ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇక ఐదో రోజు రూ.65 కోట్లు, ఆరవ రోజు రూ.56.60 కోట్లు, ఏడో రోజు రూ.48.75 కోట్లు వసూలు చేసి, మొదటి వారంలోనే రూ.674.17 కోట్ల నెట్ కలెక్షన్లతో అరుదైన రికార్డు నెలకొల్పింది. రెండో వారంలో కూడా ఈ సినిమా అదే దూకుడు కొనసాగించడం విశేషం. ఎనిమిదో రోజు రూ.49.70 కోట్లు, తొమ్మిదో రోజు రూ.41.75 కోట్లు, పదో రోజు రూ.62.85 కోట్లు, పదకొండో రోజు రూ.68.10 కోట్లు రాబట్టి మరోసారి స్టాంగ్ హోల్డ్ చూపించింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు స్థిరంగా కొనసాగాయి. పన్నెండో రోజు రూ.25.30 కోట్లు, పదమూడు రోజు రూ.27.75 కోట్లు, పద్నాలుగో రోజు రూ.20.10 కోట్లు వసూలు చేస్తూ వీక్‌డేస్‌లో కూడా మంచి రన్‌ను కొనసాగించింది.

15వ రోజు నుంచి 17వ రోజు వరకు కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. 15వ రోజు రూ.18.30 కోట్లు, 16వ రోజు రూ.21.55 కోట్లు, 17వ రోజు రూ.25.65 కోట్లు రాబట్టింది. మొత్తం 17 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.985.02 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ పరంగా ఈ సంఖ్య రూ.1,179.58 కోట్లను దాటడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగిస్తోంది. 17వ రోజు విదేశాల్లో రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, మొత్తం ఓవర్సీస్ కలెక్షన్లను రూ.385 కోట్లకు చేర్చుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.1,564.30 కోట్లకు చేరాయి.

ఇక ఇప్పుడు అందరి దృష్టి 18వ రోజు కలెక్షన్లపై పడింది. వీకెండ్ కావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం 5,800కు పైగా స్క్రీన్లలో ప్రదర్శితమవుతున్న ఈ మూవీ మళ్లీ భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంచనాల ప్రకారం 18వ రోజు రూ.30 నుంచి రూ.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అలా జరిగితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల నెట్ మార్క్‌ను దాటే రెండో చిత్రంగా 'ధురంధర్: ది రివెంజ్' నిలవనుంది. ఇప్పటికే ఈ ఫీట్‌ను పుష్ప 2 సాధించిన సంగతి తెలిసిందే. ఇదే జోరు కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్ల క్లబ్‌లోకి కూడా ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X