Dhurandhar 2 Day 2 Box Office: జవాన్, RRR రికార్డులు అవుట్.. ధురంధర్ 2 మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీమియర్ వసూళ్లు ఎంత? తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Dhurandhar The Revenge Day 2 Expected Box Office

ధురంధర్ 2 సినిమాను భారీ సెట్స్ వేసి పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాన్ని క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి సుమారుగా 30 కోట్ల రూపాయలను ప్రమోషనల్ కోసం ఖర్చు చేశారు. దాంతో పార్ట్ 2 బడ్జెట్ 280 కోట్ల రూపాయల మేర అయింది. ధురంధర్ 1 సినిమామకు 250 కోట్ల రూపాయలు అయిన విషయం తెలిసిందే.

ధురంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారానే సుమారుగా 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తొలి రోజు హిందీ వెర్షన్ 110 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగులో 4.5 కోట్ల రూపాయలు, కన్నడలో 10 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 125 కోట్ల రూపాయల నెట్, 190 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి బ్రహ్మండమైన ఆదరణ లభించింది. నార్త్ అమెరికాలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రభంజనాన్ని తలపించింది. అమెరికా, కెనడాలో ప్రీమియర్లకు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. యూఎస్‌లో 1.55 మిలియన్ డాలర్లు, కెనడాలో 450K డాలర్లు వసూలు చేసింది. తొలి రోజుతో కలిపి ఈ సినిమా 2.5 మిలియన్లు రాబట్టింది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా సుమారుగా 4.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 40 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా వీకెండ్ వరకు ఈ దాదాపు 8 నుంచి 9 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తొలి రోజు 245 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజే జవాన్, యానిమల్, RRR సినిమాల వసూళ్లను అధిగమించింది.

ఇక ఈ సినిమా రెండో రోజు కూడా ప్రభంజనం కొనసాగిస్తున్నది. ఈ సినిమా రెండో రోజు ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రాబట్టింది. ఇక రెండో రోజు 85 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తెలిపింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 400 కోట్ల రూపాయల మైలురాయికి చేరువ కానున్నది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X