Dhurandhar 2 Day 3 Box Office: 500 కోట్లకు చేరువగా ధురంధర్ 2.. 3వ రోజు ఎన్ని కోట్లంటే?
ధురంధర్ ది రివేంజ్ (Dhurandhar The Revenge) మూవీ బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. తొలి ఆట నుంచే సూపర్ బ్లాక్ బస్టర్ టాక్‌తో విడుదలైన ప్రతీ చోట బ్రహ్మండమైన టాక్‌తో దూసుకెళ్తున్నది. భాషా బేధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. దాంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలన విజయం వైపు ప్రయాణిస్తున్నది. యువ దర్శకుడు ఆదిత్య ధార్, బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్, టాలెంటెడ్ యాక్టర్ ఆర్ మాధవన్, సారా అర్జున్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా గత రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద నమోదు చేసిన సంచలనాలు, మూడో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
ధురంధర్ 2 సినిమా కోసం పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాన్ని క్రియేట్ చేయడం కోసం భారీ సెట్స్ వేశారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి సుమారుగా ఈ మూవీని 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడానికి సుమారుగా 30 కోట్ల రూపాయలను ప్రమోషనల్ కోసం ఖర్చు చేశారు. దాంతో పార్ట్ 2 బడ్జెట్ 280 కోట్ల రూపాయల మేర అయింది. ధురంధర్ 1 సినిమామకు 250 కోట్ల రూపాయలు అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 43 కోట్ల రూపాయల నెట్, 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక తొలి రోజు ఈ చిత్రం 102 కోట్ల రూపాయల నెట్, 121 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ప్రీమియర్లతో కలిపి 173 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించింది. రెండో రోజు తాజా సమాచారం ప్రకారం 80 కోట్ల రూపాయల నెట్, 97 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 270 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లోని అన్ని దేశాల్లో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం రెండు రోజుల్లోనే 8.3 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 78 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 333 కోట్ల రూపాయల నెట్, 374 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.
ఇక ఈ సినిమా మూడో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం 65 నుంచి 70 కోట్ల మధ్య వసూళ్లను సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత 3 రోజుల్లో ఈ సినిమా దాదాపు 450 కోట్ల రూపాయలకు చేరువైంది. ఈ సినిమా తొలి వారాంతానికి 550 నుంచి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications

















