Dhurandhar 2 Box Office: ధురంధర్ 2 కలెక్షన్ల సంచలనం.. RRR అవుట్.. పుష్ప 2 సేఫ్.. 4వ రోజు ఎన్ని కోట్లంటే?

ధురంధర్ ది రివెంజ్ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన కలెక్షన్ల రికార్డులను తడిచిపెట్టుకొంటూ ముందుకెళ్తున్నది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా టాప్ 10 చిత్రాల జాబితాలో చేరేందుకు రెడీ అవుతున్నది. రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను క్రియేట్ చేస్తున్నది. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించిన ఈ సినిమా 4వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

ధురంధర్ సినిమా దక్షిణాది భాషల వసూళ్ల వివరాల్లోకి వెళితే. తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో 20 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 8 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 41 కోట్ల రూపాయలు, తమిళనాడులో 12 కోట్ల రూపాయలు, కేరళలో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో 90 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ కలెక్షన్ల సాధించిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Dhurandhar 2 Day 4

ధురంధర్ ది రివెంజ్ సినిమా నార్త్ ఇండియా బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో 38 కోట్ల రూపాయలు, ఉత్తర ప్రదేశ్‌లో 14 కోట్ల రూపాయలు, పంజాబ్‌లో 8 కోట్ల రూపాయలతో 67 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సెంట్రల్ ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో, గోవాలో రికార్డు కలెక్షన్లు రాబట్టింది. దాంతో 94 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. గత రెండు రోజుల్లోనే ఈ సినిమా ఇండియా వైడ్ 250 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్ 350 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ధురంధర్ 2 సినిమా మూడో రోజు ఇండియాలో 113 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా 145 నుంచి 150 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 451 కోట్ల రూపాయల గ్రాస్, 379 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఈ సినిమా నాలుగో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి ఆదివారం రోజున కూడా రికార్డు వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.ఈ చిత్రం 115 కోట్ల నుంచి 120 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా RRR, పుష్ప 2 సాధించిన తొలి సండే రికార్డులపై కన్నేసింది.

ఇప్పటి వరకు మొదటి ఆదివారం సాధించిన టాప్ 5 చిత్రాల వివరాల్లోకి వెళితే.. పుష్ప 2 చిత్రం 141 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. RRR చిత్రం 102 కోట్లు, బాహుబలి 2 93 కోట్ల రూపాయలు, కేజీఎఫ్ 2 92 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఆదివారం RRR, KGF 2, బాహుబలి 2 సినిమా రికార్డులను బీట్ చేయనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X