Dhurandhar 2 Box Office: 1000 కోట్ల వైపు ధురంధర్ 2.. రణ్‌వీర్ సింగ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా గత 4 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? 5వ రోజు బాక్సాఫీస్ రిపోర్ట్ వివరాల్లోకి వెళితే..
గత నాలుగు రోజుల ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 145 కోట్ల రూపాయలు, రెండో రోజు ఈ సినిమా 83 కోట్ల రూపాయలు, మూడో రోజు 117 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా 466 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ధురంధర్ ది రివెంజ్ సినిమాకు ఓవర్సీస్‌లో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా విడుదలైన ప్రతీ దేశంలో కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా 5.5 మిలియన్ డాలర్లు, తొలి రోజు 4.9 మిలియన్ డాలర్లు, రెండో రోజు 6.2 మిలియన్ డాలర్లు, ఆదివారం 6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం 22.6 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 212 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఏ సినిమాకైనా సాధారణంగా సోమవారం బాక్సాఫీస్‌కు ప్రతికూలంగా మారుతుంటాయి. కానీ ధురంధర్ 2 మాత్రం ఈ సెంటిమెంట్‌ను తిరగరాస్తున్నది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఇప్పటికే 10 లక్షలకుపైగా టికెట్ల అమ్మడం జరిగింది. ఈ సినిమా దాదాపు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్నది. దాంతో ఈ తొలి సోమవారం కూడా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తున్నది.
ఇక ఈ సినిమా 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఇప్పటి వరకు 781 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం 800 కోట్ల మైలురాయిని దాటేందుకు రెడీ అయింది. ఈ సినిమా రానున్న కొద్ది రోజుల్లో 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమైంది. ఈ సినిమా సోమవారం రోజున సుమారుగా 40 నుంచి 45 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా 820 నుంచి 850 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేసుకొనే అవకాశం కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











