900 కోట్లతో ధురంధర్ 2 సంచలనం.. రణ్‌వీర్ సింగ్ మూవీకి 6వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ధురంధర్ ది రివేంజ్ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల పంటను పండిస్తున్నది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ రూపొందించిన ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట కనకవర్షాన్ని కురిపిస్తున్నది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, రాకేష్ బేడీ, సారా ఆర్జున్ తదితరులు నటించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. మార్చి 19వ తేదీన రిలీజైన ఈ సినిమా గత 5 రోజుల్లో కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 43 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు 100 కోట్ల రూపాయలు, రెండో రోజు 79 కోట్ల రూపాయలు, మూడో రోజు 105 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 104 కోట్ల రూపాయలు, 5వ రోజు 60 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా గత 5 రోజుల్లో 480 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది అని సాక్ నిక్ వెల్లడించింది.

Dhurandhar The Revenge

ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి రోజు 2.25 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 5 కోట్ల రూపాయలు, 4వ రోజు 5.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత ఐదు రోజుల్లో 18 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక కర్ణాటకలో ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 54 కోట్ల రూపాయలు, తమిళనాడులో 17 కోట్ల రూపాయలు, కేరళలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 80 కోట్ల రూపాయలు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల రిపోర్టు ద్వారా వెల్లడైంది.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. ఈ మూవీ కల్కి 2898 AD సినిమా కలెక్షన్లపై కన్నేసింది. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 5.5 మిలియన్ డాలర్లు, మొదటి రోజు 5 మిలియన్ డాలర్లు, 2వ రోజు 6.2 మిలియన్ డాలర్లు, 3వ రోజు 6 మిలియన్ డాలర్లు, 4వ రోజు సోమవారం 4 మిలియన్ డాలర్ల మేర రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా 26 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 250 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇంకా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది అని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.

గత 5 రోజుల్లో ఈ సినిమా వసూళ్ల వివరాల్లో వెళితే.. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఇండియాలో 620 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 520 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 250 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 870 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ చిత్రం మంగళవారంతో 900 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరనున్నది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి.. ఈ మూవీని సుమారుగా 10 వేల షోలను ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హిందీ వెర్షన్ 25 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 2 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షల రూపాయలు, కన్నడలో 4 కోట్ల రూపాయలు, మలయాళంలో 20 లక్షల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా 6వ రోజు 35 నుంచి 40 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X