1000 కోట్లకు చేరువలో 'ధురంధర్ 2' .. రణ్‌వీర్ మూవీకి 7వ రోజు ఎన్ని కోట్లంటే?

Dhurandhar 2 Collections: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివేంజ్' అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ భారీ వసూళ్లు నమోదు చేస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా, రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్‌పై పూర్తి ఆధిపత్యం చాటుతూ జైత్రయాత్ర కొనసాగుతోంది. మార్చి 19వ తేదీన రిలీజైన ఈ సినిమా గత 6 రోజుల్లో కలెక్షన్ల మోత మోగిస్తున్నది. ఇక ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Also Read
'ప్రభాస్ అంటే నాకు క్రష్.. ఆయన పక్కన అలా నటించను'
'ప్రభాస్ అంటే నాకు క్రష్.. ఆయన పక్కన అలా నటించను'

భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తూ రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 937.49 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలవడం విశేషం. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 687.49 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రూ. 575.72 కోట్ల నెట్ వసూళ్లు రావడం సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్‌లోనే రూ. 250 కోట్ల భారీ కలెక్షన్లు రావడం ఈ సినిమాకి ఉన్న గ్లోబల్ రీచ్‌ను తెలియజేస్తోంది.

Dhurandhar The Revenge Day 7 Expected Box Office Collections Worldwide Ranveer Singh movie towards to 1000 Crores club
Recommended For You
'ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. ఉన్న ఫేమ్ కూడా పోయింది'
'ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. ఉన్న ఫేమ్ కూడా పోయింది'

ఈ కలెక్షన్స్ లో హిందీ వెర్షన్ నుంచే అత్యధికంగా రూ. 542.72 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇక మూవీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ప్రీమియర్స్‌తోనే రూ. 43 కోట్ల కలెక్షన్ సాధించిందంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రేంజ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఇక తొలి రోజు ఏకంగా రూ. రూ. 99.1 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ నమోదు చేసింది. రెండో రోజు (డే 2) కొంత డ్రాప్ వచ్చినప్పటికీ రూ. 78.94 కోట్లు వసూలు చేసి స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది.

You May Also Like
ఆ డైరెక్టర్ అక్కడ పదే పదే తాకాడు.. ఇంట్లోవాళ్లు కూడా.. : మోనాలిసా ఆవేదన
ఆ డైరెక్టర్ అక్కడ పదే పదే తాకాడు.. ఇంట్లోవాళ్లు కూడా.. : మోనాలిసా ఆవేదన

మూడో రోజు (డే 3) శనివారం కావడంతో మళ్లీ కలెక్షన్లు భారీగా పెరిగి రూ. 105 కోట్లు రాబట్టింది. నాలుగో రోజు (డే 4) ఆదివారం ఈ మూవీ మరింత జోరుగా దూసుకెళ్లి రూ. 107 కోట్లను క్రాస్ చేసింది. వీకెండ్‌లో వరుసగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రావడం ఈ సినిమాకు ఉన్న మాస్ క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా తన స్ట్రాంగ్ హోల్డ్‌ను కొనసాగించింది.

 Varanasi: మహేష్ బాబు 'వారణాసి’సెట్ రివీల్.. రాజమౌళి విజన్‌ ఇంత పెద్దదా?
Varanasi: మహేష్ బాబు 'వారణాసి’సెట్ రివీల్.. రాజమౌళి విజన్‌ ఇంత పెద్దదా?

ఐదో రోజు (డే 5 - సోమవారం) సాధారణంగా కలెక్షన్లు తగ్గే పరిస్థితుల్లో కూడా రూ. 60 కోట్లు రాబట్టి సాలిడ్ రన్ కొనసాగించింది. ఆరవ రోజు (డే 6 - మంగళవారం) రూ. 52 కోట్ల వసూళ్లు సాధించి వర్కింగ్ డేస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద దూకుడు తగ్గలేదని నిరూపించింది. మొత్తం మీద చూస్తే, మొదటి ఆరు రోజుల్లో ఈ మూవీ దుమ్మురేపింది.

Anil Ravipudi: మల్టీస్టారర్‌ హీరోయిన్‌ ఫిక్స్.. నందమూరి హీరోకి జోడీ ఎవరంటే?
Anil Ravipudi: మల్టీస్టారర్‌ హీరోయిన్‌ ఫిక్స్.. నందమూరి హీరోకి జోడీ ఎవరంటే?

ఇక ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి.. ఈ మూవీని సుమారుగా 10 వేల షోలను ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హిందీ వెర్షన్ లో రూ. 30 కోట్లు, తెలుగు వెర్షన్ లో రూ. 2 కోట్లు, తమిళంలో రూ. 50 లక్షలు , కన్నడలో 40 లక్షలు, మలయాళంలో రూ. 20 లక్షలు, ఓవర్సీర్ లో రూ. 1 కోటి వరకు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా 7వ రోజు రూ. 40 కోట్ల నుంచి 45 కోట్లు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.

'పెళ్లికి ముందు శృంగారం.. మోజు తీరాక మజా ఏముంటుంది?'
'పెళ్లికి ముందు శృంగారం.. మోజు తీరాక మజా ఏముంటుంది?'

నేటీ కలెక్షన్లు కలుపుకొని, ప్రపంచవ్యాప్తంగా రూ. 975 కోట్ల వరకూ కలెక్షన్లు చేరుకునే అవకాశముంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఇదే ట్రెండ్ కొనసాగితే 'ధురంధర్ 2' అతి త్వరలోనే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ, ఫుల్ రన్ లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. మొత్తంగా ఈ సినిమా ఈ ఏడాది అతిపెద్ద బాక్సాఫీస్ సెన్సేషన్‌గా మారిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X