Dhurandhar 2 Day 8 Collections: 1000 కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్ 2'.. ప్రభాస్, షారుక్ రికార్డులపై రణ్‌వీర్ కన్ను.
Dhurandhar 2 Collections: 'ధురంధర్: ది రివేంజ్' బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా,మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. కేవలం 7 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది 'బ్లాక్‌బస్టర్' మూవీగా మారింది. ఇక ఈ సినిమా8 వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
దర్శకుడు ఆదిత్య ధర్.. ధురంధర్ 2 మూవీ అద్భుతంగా తెరకెక్కించగా, ఇందులో రణవీర్ సింగ్ అండర్‌కవర్ గూఢచారి పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అండర్‌వరల్డ్‌లో జరుగుతున్న రహస్య ఆపరేషన్ల నేపథ్యంలో కథ సాగుతూ, ప్రతి దశలో థ్రిల్లింగ్ మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది. తొలి భాగానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి హీరో చేసే సాహసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా స్థిరమైన వసూళ్లతో దూసుకుపోతోంది. రోజురోజుకు ప్రేక్షకాదరణ అందుకుంటూ కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇక ఇండియన్ బాకాఫీస్ వద్ద రోజువారి కలెక్షన్లు పరిశీలిస్తే.. ఈ సినిమా అసాధారణంగా దూసుకెళ్తుంది. ప్రీమియర్స్ రోజునే రూ.43 కోట్లతో అద్భుతమైన ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా.. మొదటి రోజు రూ.102.55 కోట్లు రాబట్టగా, రెండో రోజు రూ.80.72 కోట్లకు తగ్గింది. అయితే, వీకెండ్‌లో మళ్లీ జోరు పెంచి శనివారం రూ.113 కోట్లు, ఆదివారం రూ.114.85 కోట్లు వసూలు చేసింది. తర్వాత రోజుల్లో సోమవారం రూ.65 కోట్లు, మంగళవారం రూ.56.60 కోట్లు, బుధవారం రూ.47.70 కోట్లు రాబట్టి,బాక్సాఫీస్ వద్ద తన దమ్మును చాటుకుంది. కేవలం హిందీ వెర్షన్ లోనే రూ.587.22 కోట్ల (నెట్) కలెక్షన్ అందుకుంది. ఇప్పటికే ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి.. దేశవ్యాప్తంగా 7వ రోజు ఈ మూవీ 1000 పైగా థియేటర్లలో కొనసాగుతూ.. భారీ కలెక్షన్లు అందుకుంటుంది. హిందీ వెర్షన్ లో భారీగా రూ. 44.50కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్ కూడా రూ.2.50 కోట్లతో సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళంలో రూ. 0.90 కోట్లు, కన్నడలో రూ. 0.20కోట్లు, మలయాళంలో రూ. 15 లక్షలు రాబట్టింది.ఇలా వారంలోరోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 623.97 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరంగా రాణిస్తూ, త్వరలోనే మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1007.15 కోట్ల కలెక్షన్స్ సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.745.23 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, నెట్ కలెక్షన్ రూ. 623.97 కోట్లకు చేరుకుంది. ఇక ఓవర్సీస్ కూడా ధురంధర్ దూకుడు కొనసాగుతోంది. పశ్చిమాసియా,గల్ఫ్ దేశాల్లో విడుదల రద్దు అయినా దాదాపు రూ.261.92 కోట్లు రాబట్టడం గమన్హారం. మొత్తం కలెక్షన్లలో ఇండియా షేర్ 73.99 శాతం ఉండగా, ఓవర్సీస్ నుంచి 26.01 శాతం వసూళ్లు రావడం విశేషం. ఈ స్థాయి కలెక్షన్లతో ఈ సినిమా ఇప్పటికే "ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్"గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.
ఇక 8 వ రోజు కూడా భారీ కలెక్షన్లు అందుకునే అవకాశం కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 8 వ రోజు హిందీ వెర్షన్ లో రూ.30 కోట్లు, తెలుగు వెర్షన్ లో రూ. 1.5 కోట్లు, తమిళంలో రూ. 50 లక్షలు , కన్నడలో 40 లక్షలు, మలయాళంలో రూ. 20 లక్షలు, ఓవర్సీర్ లో రూ. 1 కోటి వరకు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా 8వ రోజు రూ.40 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముందట. ఇక లెక్కన చూస్తే.. ఈ సినిమా అతి త్వరలోనే కల్కి 2898 AD (రూ.1,042 కోట్లు) కలెక్షన్లను దాటే అవకాశముంది. అలాగే, జవాన్ (రూ.1160 కోట్లు) లైఫ్‌టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశముంది.


Click it and Unblock the Notifications



















