Dies Irae 4 days Box Office: డైస్ ఎరా బాక్సాఫీస్ సంచలనం.. 4 రోజుల్లోనే లాభాల్లోకి.. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం డైస్ ఎరా (Dies Irae). హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. చక్రవర్తి రామచంద్ర నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో సుస్మిత భట్, జిబిన్ గోపినాథ్, మనోహరి జాయ్, జయ కురుప్, అరుజ్ అజికుమార్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు షఫిఖ్ మహ్మద్ ఆలీ ఎడిటర్‌గా, షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫిని, క్రిస్టో జేవియర్ మ్యూజిక్ అందించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Dies Irae 4 days Box Office

మలయాళ సినిమా రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూపొందిన హారర్ థ్రిల్లర్ డైస్ ఎరా. అనుక్షణం భయాన్ని కలిగిస్తూ.. వెన్నులో చలిపుట్టించేలా ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో, యువ నటీనటుల ప్రతిభతో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన టెక్నిషియన్స్‌ రెమ్యునరేషన్లు, మూవీ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 25 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో థియేట్రికల్ రన్ మొదలుపెట్టింది.

డైస్ ఎరా సినిమా విషయానికి వస్తే.. తొలి ఆట నుంచే బ్రహ్మండమైన పాజిటివ్ టాక్‌తో జర్నీ మొదలుపెట్టింది. అయితే ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ రావడంతో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. అంతేకాకుండా అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక తొలి రోజు ఈ సినిమా ఇండియా వైడ్ 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 6 కోట్ల రూపాయలు, మూడో రోజు 6 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 23 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది అని సాక్ నిక్, ఇతర ట్రేడ్ సంస్థలు వెల్లడించింది.

డైస్ ఎరా సినిమా వివిధ భాషల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో గత నాలుగు రోజుల్లో 18.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటకలో 2.5 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, తమిళంలో 1 కోటి రూపాయలు, నార్త్ ఇండియాలో 50 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా 23 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా డైస్ ఎరా సాధించిన గ్రాస్ వసూళ్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు 10 కోట్ల రూపాయలు, రెండో రోజు 15 కోట్ల రూపాయలు, మూడో రోజు 15 కోట్ల రూపాయలు, 4వ రోజు 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 45 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X