twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ అదే దీనస్ధితి(ట్రేడ్ టాక్)

    By Staff
    |

    Swathy
    క్రితం వారం రిలీజైన నాలుగు చిత్రాలూ దేనికదే విభిన్నంగా ఉంటూ వేరు వేరు జనర్స్ తో మంచి ఆసక్తినే రేపాయి. అయితే వీటిలో ఏదీ ప్రేక్షకాదరణ పొందక విమర్శలు ఎదుర్కొన్నాయి. అలాగే ఆ నాలుగు చిత్రాలు కూడా చిన్నవే కావటం మరో విశేషం. ఆ చిత్రాలు వెంగమాంబ,ఆ ఇంట్లో,ఊహాచిత్రం,కలవరమాయే మదిలో .అయితే వీటిల్లో ఏదీ ఓపినింగ్స్ ని కూడా రాబట్టుకోలేకపోయింది. మీనా ప్రధాన పాత్రలో దొరస్వామిరాజు నిర్మించిన చిత్రంలో టీవీ స్టార్స్ ఎక్కువమంది అవటం మైనస్ గా మారింది. పాటలు బాగున్నా కథ,కథనాలు కొంత మేరుకు సాగటం మరో మైనస్ అంటున్నారు.

    ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు చిన్నా తొలిసారి దర్శకత్వం వహించిన ఆ ఇంట్లో చిత్రం కూడా చతికిలపడింది. హర్రర్ జనర్ గా వచ్చిన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోతోంది. వర్మలా తీసానంటున్నా అటు వెపు వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యటం లేదు. అందులోనూ వేరే అర్టిస్టుని పెట్టి చిన్నా కేవలం దర్శకుడుగా మాత్రమే తీసి ఉంటే వర్కవుట్ అయ్యేదని అంటున్నారు.

    మరో ప్రక్క కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో హోప్ చిత్ర దర్శకుడు సతీష్ రూపొందించిన కలవరమాయే మదిలో చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఫస్టాఫ్ ఈ చిత్రం బాగానే ఉన్నా సెకెండాఫ్ కథనం దారి తప్పిందని చూసిన వాళ్లు విసుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త దర్శకుడు పరిచయం అవుతూ తీసిన ఊహాచిత్రం సినిమా ధ్రిల్లర్ జనర్ లో వచ్చింది. అయితే అది కూడా ప్రేక్షకులను ధియోటర్స్ వైపుకు లాగటంలో విఫలమవుతోంది. వీటి పరిస్ధితి ఇలా ఉంటే గత వారం చిత్రంలు అప్పుడే ధియోటర్స్ విడిచిపెట్టి స్వస్ధలానికి చేరుకున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X