Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మళ్లీ అదే దీనస్ధితి(ట్రేడ్ టాక్)
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టు చిన్నా తొలిసారి దర్శకత్వం వహించిన ఆ ఇంట్లో చిత్రం కూడా చతికిలపడింది. హర్రర్ జనర్ గా వచ్చిన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోతోంది. వర్మలా తీసానంటున్నా అటు వెపు వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యటం లేదు. అందులోనూ వేరే అర్టిస్టుని పెట్టి చిన్నా కేవలం దర్శకుడుగా మాత్రమే తీసి ఉంటే వర్కవుట్ అయ్యేదని అంటున్నారు.
మరో ప్రక్క కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో హోప్ చిత్ర దర్శకుడు సతీష్ రూపొందించిన కలవరమాయే మదిలో చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఫస్టాఫ్ ఈ చిత్రం బాగానే ఉన్నా సెకెండాఫ్ కథనం దారి తప్పిందని చూసిన వాళ్లు విసుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త దర్శకుడు పరిచయం అవుతూ తీసిన ఊహాచిత్రం సినిమా ధ్రిల్లర్ జనర్ లో వచ్చింది. అయితే అది కూడా ప్రేక్షకులను ధియోటర్స్ వైపుకు లాగటంలో విఫలమవుతోంది. వీటి పరిస్ధితి ఇలా ఉంటే గత వారం చిత్రంలు అప్పుడే ధియోటర్స్ విడిచిపెట్టి స్వస్ధలానికి చేరుకున్నాయి.