'దిల్ బోలే హడిప్పా' ఏమైంది??
రాణీ ముఖర్జీ మరో సారి నాయికగా బిజీ కావాలన్న ఆశతో చేసిన సినిమా 'దిల్ బోలే హడిప్పా'. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఆది నుండీ రాణీ, షాహిద్ ల జోడీ గురించి విమర్శలపాలయిన ఈ చిత్రం మరో ఫ్లాప్ సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల భోగట్టా. తన కంటే వయసులో చిన్న వాడైన షాహిద్ కపూర్ సరసన సూట్ అయ్యేందుకు రాణి ఎంతో కష్టపడి సన్నబడింది. పనిలో పనిగా సినిమా క్రేజ్ పెంచేందుకు బికినీ కూడా వేసేసుకుంది.
ఇంతా కష్టపడి 'డూ ఆర్ డై' అన్న పరిస్థితుల్లో వున్న రాణికి ఈ చిత్రం విజయాన్ని ఇవ్వలేకపోయింది. రివ్యూలు సైతం సినిమాను చెండాడుతూ యష్ రాజ్ బ్యానర్ లో మరో ఫ్లాప్ సినిమా అని డిసైడ్ చేసారు. ఇంతా కష్టపడ్డా లాభం లేకపోవడంతో రాణీ ఆంటీ పెళ్లి ఆలోచనల్లో పడిపోయారని బి-టౌన్ న్యూస్.
dil bole hadippa flop talk rani mukharjee shahid kapoor yash raj films దిల్ బోలే హడిప్పా ఫ్లాప్ టాక్ రాణీ ముఖర్జీ షాహిద్ కపూర్ యష్ రాజ్ మూవీస్


Click it and Unblock the Notifications