Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఇద్దరి హీరోలకు 200కోట్లు ఇస్తున్న దిల్ రాజు.. కెరీర్ మొత్తంలో ఇదే హయ్యెస్ట్ పేమెంట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లు అందుకునేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక మెల్లగా ఆయన కూడా సంస్థ వాల్యుని పెంచేలా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇద్దరి అగ్ర హీరోలతో కమిట్మెంట్ తీసుకున్న దిల్ రాజు దాదాపు వాళ్లకు 200 వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.
Recommended Video
ఏ మాత్రం తక్కువ కాకుండా
ఒకవైపు అల్లు అరవింద్ మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా సినిమాలను చేసేందుకు బిజీ అవుతుండగా దిల్ రాజు కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా అగ్ర హీరోలతో డీలింగ్స్ సెట్ చేసుకుంటున్నాడు. దిల్ రాజు ప్లాన్ చేయగలిగితే తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టగలడని చాలా మంది హీరోలకు నమ్మకం ఉంది.
ఆ దర్శకుడికి అపారమైన నమ్మకం
ఇక అందుకే ఆయనతో సినిమా చేయాలని పక్క ఇండస్ట్రీలోని దర్శకులు హీరోలు కూడా రెడీ అంటున్నారు. దిల్ రాజు అంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు అపారమైన నమ్మకం. దాదాపు శంకర్ సినిమాలన్నీ తెలుగులో దిల్ రాజుతోనే రిలీజ్ అవుతుంటాయి. ఇక ఆ డైరెక్టర్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ తో డీలింగ్
ఇక మరోవైపు ప్రభాస్ తో కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్న దిల్ రాజు ఎలాగైనా డార్లింగ్ తో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసం కథలను వెతుకుతున్నారు. ఇక ప్రభాస్ మార్కెట్ కు తగ్గట్లుగానే దిల్ రాజు 100కోట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.
విజయ్ సినిమాకు కూడా..
ఇక మరోవైపు విజయ్ తో కూడా ఒక సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం విజయ్ కు కూడా 100కోట్లకు తక్కువ కాకుండా పారితోషికం ఫిక్స్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు కెరీర్ మొత్తంలో 100కోట్ల బడ్జెట్ సినిమాలను ఎక్కువగా చేసింది లేదు. అలాంటిది హీరోలకు మాత్రమే రెమ్యునరేషన్స్ వంద కొట్లకు ఫిక్స్ చేస్తున్నారంటే ఇక మొత్తం బడ్జెట్ ఏ స్థాయిలో కేటాయిస్తారో చూడాలి మరి.