Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Pawan Kalyan తొలిప్రేమను 72 లక్షలకు కొంటె.. ఆ మొత్తం ఓకే థియేటర్ నుంచి వచ్చింది.. దిల్ రాజు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు అనే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ కెరిర్ లో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో తొలి ప్రేమ కూడా టాప్ లిస్టులో ఉంటుంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఆ సినిమాకు అప్పట్లో వచ్చిన ప్రాఫిట్ గురించి పెట్టుబడి గురించి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
మ్యూజికల్ హిట్
పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన తొలిప్రేమ సినిమా పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో లాభాలు అందించిన సినిమాలలో ఒకటి. ఈ సినిమా విడుదలకు ముందే పాటల ద్వారా మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి. తమిళ సంగీత దర్శకుడు దేవా ఇచ్చిన సంగీతం అప్పుడు మాత్రమే కాకుండా నేటితరం యువతును కూడా ఇప్పటికీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.
మొదట చేయవద్దని...
ఈ సినిమాను తమిళ దర్శకుడు కరుణాకరన్ తెరపైకి తీసుకువచ్చాడు. అతనికి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా కథపై మొదట అభిప్రాయాలు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ కు చాలా మంది చేయవద్దు అని చెప్పారు. కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం ఊహించిన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా 1998 జూలై 24వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది.
తొలిప్రేమతోనే..
అయితే ఇటీవల ఇంటర్వ్యూలలో నిర్మాత దిల్ రాజు తొలిప్రేమ ద్వారా వచ్చిన కలెక్షన్స్ గురించి వివరణ ఇచ్చారు. మొదట ఆటోమొబైల్స్ బిజినెస్ చేస్తూ మంచి లాభాలను అందుకున్నాము.. అయితే మొదట్లో కొన్ని సినిమాలపై పెట్టిన పెట్టుబడి కారణంగా దారుణంగా నష్టపోవాల్సి వచ్చింది. కానీ తొలిప్రేమ సినిమా ద్వారా ఒక్కసారిగా ప్రాఫిట్ లోకి వచ్చి మంచి డిస్ట్రిబ్యూటర్ గా గుర్తింపు అందుకున్నట్లు చెప్పారు.
ప్రాఫిట్ ఎంతంటే..
దిల్ రాజు మాట్లాడుతూ అప్పట్లో తొలిప్రేమ నైజం హక్కులు 72 లక్షలకు కొనుగోలు చేశాను. సినిమా విడుదల అనంతరం చాలా మంచి ప్రాఫిట్ అందించింది. మొత్తంగా డిస్ట్రిబ్యూటర్ షేర్ 2 కోట్ల 80 లక్షలు వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ గా మొదట నేను అత్యధిక ప్రాఫిట్ అందుకున్నది కూడా తొలిప్రేమ సినిమాతోనే. అక్కడి నుంచి మంచి సక్సెస్ రేటుతో వెళ్లినట్లు దిల్ రాజు తెలియజేశారు.
ఓకే ఒక్క థియేటర్ నుంచి
ఇక తొలిప్రేమ సినిమా దిల్ రాజుకు కాకుండా ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చాలావరకు లాభాలు అందుకున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే.. నైజం రైట్స్ 72 లక్షలకు అందుకుంటే ఆ అమౌంట్ మొత్తం కూడా ఒకే ఒక్క థియేటర్ నుంచి రావడం విశేషం. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70mm థియేటర్ నుంచి దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం దిల్ రాజుకు వెనక్కి వచ్చింది. ఆ థియేటర్లోనే తొలిప్రేమ 217 రోజులు ఆడింది.