Toxic Business: దిల్ రాజు చేతికి తెలుగు రాష్ట్రాల టాక్సిక్ రైట్స్, ఆంధ్రా, నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే?
కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, కునాల్ శర్మ సౌండ్ ఇంజినీర్‌గా, గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్ష కొరియోగ్రాఫర్లుగా, జేజే పెర్రీ, అంబరివ్, కెచా కంపాక్‌డీ, అమృత్ సింగ్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2026, మార్చి 19వ తేదీన రిలీజ్ అవుతున్నది.

ఈ సినిమా ఇప్పటికే వివాదాలకు కేంద్ర బిందువుగా మారి విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమాపై అంచనాలు మాత్రమే పెరగడం కాకుండా భారీగా బిజినెస్ జరిగేలా చేసింది. ఈ సినిమా తెలుగు, రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. ఈ సినిమా ఎన్ని కోట్ల బిజినెస్ చేసింది? ఎంత వసూలు చేస్తే లాభాల్లోకి వస్తుందనే వివరాల్లోకి వెళితే..
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్, థ్రిల్లర్ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంకా పలు భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో భారీగా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, రిలీజ్ డేట్ మోషన్ పోస్టర్ సంచలనం రేపింది. యష్ యాటిట్యూడ్, డైరెక్టర్ టేకింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దాంతో బిజినెస్ సర్కిల్స్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా రైట్స్ కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పలువురు పెద్ద నిర్మాతలు పోటీపడ్డారు. కానీ చివరకు ఈ సినిమా హక్కులు మాత్రం దిల్ రాజుకు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో హక్కుల కోసం 120 కోట్ల రూపాయలు కమిషన్ బేస్ మీద అడ్వాన్సుగా చెల్లించి సొంతం చేసుకొన్నారు అని SVC అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల షేర్, సుమారుగా 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే టాక్సిక్ సినిమా రైట్స్ తీసుకోవడం ఛాలెంజిగ్ వ్యవహారం. ఆయన ఈ విషయంలో రిస్క్ చేస్తున్నాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే అదే రోజు ధురంధర్ ది రివెంజ్ రిలీజ్ అవుతున్నది. అయితే ఇలాంటి రిస్క్ నిర్ణయాలు తీసుకోవడం, సక్సెస్ కావడం ఆయనకు సహజమే. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రైట్స్ తీసుకొన్నట్టు అభిప్రాయపడుతున్నారు.
టాక్సిక్ రైట్స్ కొనుగోలుపై ఎస్వీసీ స్పందిస్తూ.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాష్ టాప్ హీరో. వరల్డ్ వైడ్‌గా తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకొన్నారు. కేజీఎఫ్ 2 సినిమా తర్వాత సినీ అభిమానులు ఈ సినిమా కోసం నాలుగేళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. అందుకే ఈ సినిమా రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నాం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











