Animal: తెలుగులో యానిమల్ సంచలనం.. ఏకంగా అన్ని కోట్లతో దిల్ రాజు రిస్క్

'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసి.. అదే మూవీని 'కబీర్ సింగ్' పేరుతో హిందీలోకి రీమేక్ చేసి.. దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అతడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా రూపొందించిన మూవీనే 'యానిమల్'. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌తో మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

క్రేజీ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' చిత్రాన్ని ఆగస్టు 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో అప్పుడు విడుదల చేయలేదు. ఇక, ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన తీసుకు వస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీ హడావిడి బాగా కనిపిస్తోంది.

Dil Raju Bagged Animal Movie Telugu States Rights with Huge Price

ఎంతో మంది స్టార్లు కలిసి నటిస్తోన్న 'యానిమల్' మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్లకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ముఖ్యంగా టీజర్, పాటలు, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో అంచనాలను పెంచేశాయి. ఫలితంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ హక్కులకు హిందీతో పాటు తెలుగులోనూ భారీ డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'యానిమల్' మూవీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారని తాజాగా తెలిసింది. ఇందుకోసం ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఏకంగా రూ. 15 కోట్లు మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ మూవీని ఆయన రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

'యానిమల్' మూవీ థియేట్రికల్ హక్కులకు గానూ దిల్ రాజు పెట్టిన మొత్తం గతంలో ఏ బాలీవుడ్ మూవీకి పెట్టలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బిజినెస్ చేసుకున్న సినిమాగా 'యానిమల్' సంచలన రికార్డును నమోదు చేసింది. ఇక, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం టాక్ కూడా మంచిగా వస్తే ఈ మొత్తం రికవరీ చేయడం ఈజీనే అనొచ్చు.

ఇదిలా ఉండగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబోలో రాబోతున్న 'యానిమల్' మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు సంగీతాన్ని అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ వంటి వాళ్లు కీలక పాత్రలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X