రవితేజ కెరీర్ లోనే తొలిసారి
హైదరాబాద్ :'పవర్'కి రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో సినిమా బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతోంది. ఈ చిత్రం నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 9 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ కెరీర్లో ఇంత పెద్ద మొత్తంలో నైజాం రైట్స్ అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
ఇక మరో ప్రక్క ఆడియో,శాటిలైట్ రైట్స్ కలిపి 7.5 వచ్చాయని వినికిడి. దాంతో మొత్తం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 31 కోట్లు జరిగిందని అంటున్నారు. ఇది రవితేజ చిత్రాలలో పెద్ద రికార్డు.

దర్శకుడు మాట్లాడుతూ... పవర్ అంటే ఇంటికొచ్చే కరెంటు కాదు. బయట చేసే రాజకీయం కాదు. అది ఒంట్లో ఉండాలి.. అలాంటి హీరోని మా చిత్రంలో చూడొచ్చు అన్నారు అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''పవర్ ఫుల్ పోలీస్ కథ ఇది. పేరుకు తగ్గట్టుగానే ప్రతీ సన్నివేశం శక్తిమంతంగా ఉంటుంది. రవితేజ సినిమా నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో.. అవన్నీ మేళవించి ఓ రంగుల హరివిల్లులా తీర్చిదిద్దాం ''అన్నారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).


Click it and Unblock the Notifications











