16 కోట్లకు రచ్చ, దమ్ము
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు రచ్చ, దమ్ము చిత్రాల నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ రెండు చిత్రాలను ఆయన నాన్ రిఫెండబుల్ అడ్వాన్స్ పద్దతిలో తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ రెండు చిత్రాలు మాస్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. అలాగే ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ భారీ మొత్తాన్ని ఈ రెండు చిత్రాలపై దిల్ రాజు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రచ్చకి, దమ్ము కి నెల రోజుల గ్యాప్ ఉండేలా విడుదల ప్లాన్ చేస్తూండటంతో ధియోటర్స్ ఇబ్బంది ఉండవని భావిస్తున్నారు.
తెలుగు సినిమాకి పెద్ద మార్కెట్ అయిన నైజాంలో పెద్ద డిస్ట్ర్రబ్యూటర్ గా మారిన దిల్ రాజు రైట్స్ తీసుకున్నారంటే మిగతా డిస్ట్రిబ్యూటర్ అంతా ఎగబడుతూంటారు. అందుకే మొదట నిర్మాతలంతా తమ చిత్రాన్ని దిల్ రాజు కి చూపించి ఆయన తీసుకునేలా ప్లాన్ చేస్కుంటూంటారు. అందులోనూ ఈ రెండు చిత్రాలు రిలీజై రిజల్ట్ ఎలా ఉన్నా ఓపినింగ్స్ మాత్రం ఓ రేంజిలో ఉంటాయని తెలిసిందే. ధియోటర్స్ సంఖ్య ఎక్కువ చేసి విడుదల చేస్తున్న నేపధ్యంలో టాక్ బయిటకు వచ్చేలోపే డబ్బు లాగేస్తున్నారు. కాబట్టి ఎంత పెట్టుబడి పెట్టినా లాస్ ఉండదు అని ట్రేడ్ వర్గాలు ఈ బిజినెస్ పై వ్యాఖ్యానిస్తున్నాయి. మరో ప్రక్క ఈ రెండు చిత్రాలు కూడా ఓ రేంజి హిట్టై రికార్డులు క్రియేట్ చేస్తాయని పాజిటివ్ టాక్ అంతటా ఉంది.


Click it and Unblock the Notifications











