ఇలియానా మీదే దిల్ రాజు కోట్ల పెట్టుబడి
కేవలం ఇలియానాని నమ్ముకునే దిల్ రాజు కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. ఇలియానా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న త్రి ఇడియట్స్ రీమేక్ ..త్రీ రాస్కేల్స్ విడుదల రైట్స్ ని ఆయన తీసుకున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తమే వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇలియానాకు తెలుగులో ఉన్న మార్కెట్ తో పాటు,అపజయమెరగని శంకర్ దర్సకత్వం కూడా ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో హీరోలైన విజయ్,శ్రీకాంత్,జీవాలకు తెలుగులో మార్కెట్ లేదు. రంగంతో జీవా కొద్దిగా పేరు తెచ్చుకున్నా అతని ఇండిడ్యువల్ గా ఇక్కడ మార్కెట్ లేదు. దానికి తోడు హైదరాబాద్ వంటి అర్బన్ ప్రాంతాల్లో త్రీ ఇడియట్స్ చిత్రం చాలా మంది చూసేసారు.
అయినా దిల్ రాజు పెట్టుబడి పెట్టడానికి కారణం ఇలియానా మీద బెట్ లాంటిదే అంటున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి అనంతరం అంటే జనవరి 26,2012 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో 'నాన్బన్'టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఇలియానా ఈ చిత్రం గురించి చెపుతూ.. త్రీ ఇడియట్స్ చిత్రానికి శంకర్ చాలా మార్పు చేర్సులు చేశాడని చెబుతోంది. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రాన్ని ఆయన మార్చాడని అంటోంది. అలాగే తన పాత్రని గెటప్ ని కూడా కొత్తగా తీర్చి దిద్దాడని వివరించింది. ఈ చిత్రంలో తన పాత్ర పరిధి పెంచారని, కచ్చితంగా ఈ సినిమా తనకి పెద్ద ప్లస్ అవుతుందని చెబుతోంది. అంతే కాక ఈ సినిమాలో తాను నాలుగో ఇడియట్ నని అంటోంది.


Click it and Unblock the Notifications











