RRR తరువాత మరో స్టార్ హీరో సినిమాపై దిల్ రాజు భారీ పెట్టుబడి.. నైజాంలో బిగ్ రిలీజ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దిల్ రాజు ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా మార్కెట్లో ఆ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడే విధంగా ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అంతే కాకుండా సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళడంలో దిల్ రాజుకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. నిర్మాతగా కంటే ముందుగా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత చిన్న సినిమాలతోనే భారీ విజయాన్ని అందుకున్న దిల్ రాజు ఇప్పుడు అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏకంగా పాన్ ఇండియా సినిమాలు కూడా లైన్ లో పెడుతూ ఉండడం విశేషం.
అవసరమైతే తెలుగు చిత్రపరిశ్రమలోనే తనతో సమానంగా ఉండే మరికొంతమంది అగ్ర నిర్మాతలు సహాయాన్ని కూడా తీసుకుంటున్నాడు. ఇక ఇటీవల నిర్మాత దిల్ రాజు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR సినిమాకు సంబంధించిన నైజాం రిలీజ్ రైట్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించే విధంగా ముందుకు సాగుతోంది. అంతకుముందు దిల్ రాజు రాధే శ్యామ్ సినిమాతో నైజాం ఏరియాలో భారీగా విడుదల చేసి కోలుకోలేని ఎదురుదెబ్బ తిన్నాడు. ఆ సినిమాతో దాదాపు దిల్ రాజు 15 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు RRR సినిమా మాత్రం పెట్టిన పెట్టుబడికి భారీస్థాయిలో లాభాలను అందిస్తుంది. RRR సినిమాతో దిల్ రాజుకు దాదాపు 30 కోట్లకు పైగానే లాభాలు అందే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక దిల్ రాజు తన తదుపరి ఫోకస్ మొత్తం బీస్ట్ సినిమా పై పెట్టబోతున్నాడు. ఇప్పటికే విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఒక సినిమా నిర్మించేందుకు సిద్ధమైన దిల్ రాజు అంతకంటే ముందు విజయ్ బీస్ట్ ను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసే బాధ్యతను తీసుకున్నాడు. ఆ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. విజయ్ ఇంతకుముందు చేసిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా మంచి ప్రాఫిట్స్ అంధించాయి. ఇక ఇప్పుడు బీస్ట్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆ సినిమా తెలుగు హక్కులను 12 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
అయితే బీస్ట్ సినిమా బిజినెస్ లో కేవలం దిల్ రాజు పాత్ర మాత్రమే లేదు. ఆయనతోపాటు మరో అగ్ర నిర్మాత సురేష్ బాబు కూడా భాగస్వామిగా ఉన్నారు. అంతే కాకుండా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ కూడా ఈ సినిమానీ తెలుగులో విడుదల చేస్తూ ఉండడం విశేషం. ఈ ముగ్గురు అగ్ర నిర్మాతలు కూడా బీస్ట్ సినిమా పై పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందుకోవాలి అని చూస్తున్నారు. ముఖ్యంగా దిల్ రాజు ఈ సినిమా లో ఎక్కువ ప్రాఫిట్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా నైజాం ఏరియా మొత్తం ఆయనే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. మరి ఈ నెల 14న విడుదల కాబోయే బెస్ట్ సినిమా ఆయనకు ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











