బాలకృష్ణ కోసం దిల్ రాజు భారీ సాహసం: నటసింహా కెరీర్‌లోనే తొలిసారి అన్ని కోట్లతో డీల్

చాలా కాలంగా విజయాన్ని అందుకోలేక మాంచి ఆకలితో ఉన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీంతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఆయన సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ, హిట్ మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెద్ద సాహసమే చేశారని తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ బడా దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

అలాంటి పాత్ర చేస్తోన్న నటసింహా

అలాంటి పాత్ర చేస్తోన్న నటసింహా

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీ కోసం బాలకృష్ణ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా అఘోరాగా కనిపించబోతున్నారు. తద్వారా ఈ తరహా పాత్రను పోషిస్తోన్న ఏకైక స్టార్ హీరోగా నిలిచారు. ఇక, ఈ మూవీలో బాలయ్య కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టాడు

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టాడు

గత ఉగాదికి 'అఖండ' టైటిల్ రోర్ వీడియో విడుదలైంది. ఎంతో పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులను తిరగరాసింది. అంతేకాదు, వేగంగా యాభై మిలియన్లు దాటిన టీజర్‌గా టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. సీనియర్ హీరోల జాబితాలో సౌతిండియాలోనే మొదటి స్థానానికి చేరారు బాలయ్య.

 భారీ అంచనాలు... బిజినెస్ భారీగా

భారీ అంచనాలు... బిజినెస్ భారీగా

'అఖండ' సినిమాపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, రెండు టీజర్లు విడుదలైన తర్వాత అవి అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాను కొనేందుకు చాలా మంది బయ్యర్లు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అలాగే, శాటిలైట్ డిజిటల్ రైట్స్‌కు అత్యధిక డీల్స్ వచ్చాయి.

రిలీజ్ డేట్ ఫిక్స్.. దిల్ రాజు ఖాతా

రిలీజ్ డేట్ ఫిక్స్.. దిల్ రాజు ఖాతా

'అఖండ' సినిమాను మే 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అప్పుడు కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఇక, ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజాం రైట్స్‌ను దిల్ రాజు భారీ ధరకు సొంతం చేసుకున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

బాలకృష్ణ కోసం దిల్ రాజు సాహసం

బాలకృష్ణ కోసం దిల్ రాజు సాహసం

'అఖండ' నైజాం హక్కులను దిల్ రాజు తీసుకున్నారన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. దీని కోసం ఆయన ఏకంగా రూ. 19 కోట్లు చెల్లించారని తెలిసింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. ఇక, ఇంత మొత్తానికి హక్కులను తీసుకున్న దిల్ రాజు.. సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X