శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బిజినెస్ డిటేల్స్
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...-''నేను ఏ సినిమా చేసినా విలువల్ని మాత్రం మర్చిపోను. ఈ సినిమా మిమ్మల్ని షాక్‌కి, థ్రిల్‌కి గురి చేస్తుందని చెప్పను కానీ, కొన్నాళ్ల పాటు మీతో జర్నీ చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. కోరికలు, ఆశలు, సంతోషాలు... ఇదే ఈ సినిమా కథ. ఓ కాలనీలోని ఆరుగురు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది. మన బాంధవ్యాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమా ఓ విధంగా నా కల. ఈ కల కార్యరూపం దాల్చడానికే రెండేళ్లు పట్టింది. ఈ సినిమా మేకింగ్‌లో చాలా అవాంతరాలు ఎదురొచ్చినా అధిగమించగలిగాం. వేటూరిగారు లేకపోవడం నాకు గొప్ప విషాదం. ఈ సినిమాలో అమల తొలుత చేయనన్నారు. చాలా బతిమిలాడాను. ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఈ విషయంలో నాగార్జున గారికి కృతజ్ఞతలు చెబుతున్నా'' అన్నారు.
నూతన తారలతో అమీగోస్ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమైంది. అభిజిత్, సుధాకర్, కౌశిక్, జార, రస్మి, కావ్య, నవీన్, విజయ్, సంజయ్ తదితర నూతన తారలు పరిచయమవుతున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ తమ చిత్రానికి సంబంధించిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ సందర్భంగా ఆడియోను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నానని అన్నారు. చిత్రానికి ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోందని, అన్నారు.
తన దర్శకత్వంలో విడుదలైన చిత్రాలలోకెల్లా ఈ చిత్రాన్ని అత్యధిక ప్రింట్లతో సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నామని, హ్యేపీడేస్ చిత్రం కన్నా ఈ చిత్రం తనకు మంచి గుర్తింపునిస్తుందని, కథకు సరైన పేరునే నిర్ణయించామని చిత్రం విడుదలయ్యాక అందరూ అంటారని ఆయన తెలిపారు. వచ్చేనెల ప్రారంభం నుండి పబ్లిసిటీ ప్రారంభం చేస్తామని, తన కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీగా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన వివరించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, నిర్మాత: చంద్రశేఖర్ కమ్ముల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications












