ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు చేతికి
చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినా దిల్ రాజు పపంపిణీ చేస్తే ఆ చిత్రం రేంజి వేరేగా ఉంటుందని భావించిన నిర్మాతలు దీని రైట్స్ మొత్తం ఆయనకే ఇచ్చిసినట్లు సమాచారం. దాదాపు 3.75 కోట్లకి ఈ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. కొత్త దర్శకుడు, హీరో, హీరోయిన్స్ కొత్త వాళ్లు అయినా ఈ రేటు పలకటం చాలా గొప్ప విషయం అని ట్రేడ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
దర్శకుడు హను మాట్లాడుతూ... సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య ఓ ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుందో మా సినిమాలో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ కూడా అలానే ఉంటుంది. 1990ల్లో జరిగిన ప్రేమ కథ ఇది. ఓ అందమైన దృశ్య కావ్యంలా చూపించే ప్రయత్నం చేశాం. రధన్ అందించిన స్వరాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ ''మధురమైన బాణీలు ఇవ్వడానికి సరిపోయే ఓ చక్కటి ప్రేమ కథ ఇది''అన్నారు.
నవీన్, రాహుల్, లావణ్య ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'అందాల రాక్షసి'. రధన్ సంగీతం అందించారు. బాండ్ పేపర్ మీద రాసిస్తాను... హను కచ్చితంగా గొప్ప దర్శకుడు అవుతాడు. ఇది నా సినిమాలాంటిదే. ఐదేళ్ల క్రితం హను రూపొందించిన షార్ట్ ఫిల్మ్ చూశాను. అత్యద్భుతంగా రూపొందిన లఘు చిత్రాల్లో అదొకటి అన్నారు దర్శకుడు రాజమౌళి.


Click it and Unblock the Notifications












