ఆ సినిమా రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు
తెలుగు పరిశ్రమలో చెప్పుకొదగ్గ నిర్మాతల్లో ఒకరుగా ఎదిగిన దిల్ రాజు పంపిణీ రంగంలోనూ గోల్డెన్ హ్యాండ్ అన్న సంగతి తెలిసిందే. దాంతో తమ చిత్రాన్ని దిల్ రాజు పంపిణి చేస్తే హిట్ అని చాలా మంది నిర్మాతలు భావిస్తారు. అంతేగాక దిల్ రాజు తీసుకున్నాడంటే మిగతా ఏరియాలు వ్యాపారం త్వరగా పూర్తవుతుంది. తాజాగా ఆయన సారాయి వీర్రాజు చిత్రం నైజాం, వైజాగ్ రైట్స్ తీసుకున్నారు. అజయ్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని కన్నన్ అనే నూతన దర్శకుడు రూపొందించాడు. కన్నన్ గతంలో రాజమౌళి,క్రిష్ ల వద్ద పనిచేసారు. దాంతో ఈ ప్రాజెక్టుపై మంచి క్రేజ్ ఏర్పడింది. సహజ పాత్రలతో ఈ చిత్రం నడుస్తుందని, అజయ్ ని ఓ కొత్త కోణంలో చూపుతుందని అంతటా వినపడుతోంది.నవంబర్ 19న ఈ చిత్రం అంతటా రిలీజ్ కానుంది. బెస్టాఆఫ్ లక్ అజయ్.
More from Filmibeat
సారాయి వీర్రాజు అజయ్ దిల్ రాజు నైజాం వైజాగ్ నవంబర్ 19 కన్నన్ రాజమౌళి క్రిష్ విక్రమార్కుడు గోల్డెన్ హ్యాండ్ saarai veeraju ajay dil raju nizam vizag kannan rajamouli krish


Click it and Unblock the Notifications











