రాధేశ్యామ్‌తో భారీ నష్టాలు.. ఒకే ఒక దెబ్బతో రికవరీ చేసిన దిల్ రాజు.. ఏం జరిగిందంటే!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదట డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఉన్నత స్థాయికి ఎదిగిన వారిలో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు ఏదైనా సినిమాను నమ్మి విడుదల చేశారు అంటే తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని మిగతా దర్శక నిర్మాతలు కూడా ఎంతగానో నమ్ముతారు. అంతగా మంచి క్రేజ్ అందుకున్న దిల్ రాజుకు అప్పుడప్పుడు కొన్ని సినిమాలతో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇక ఇటీవల ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కొన్న దిల్ రాజు ఆ తర్వాత వెంటనే RRR సినిమాతో నష్టాలను రికవరీ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

రాధే శ్యామ్ తో బిజినెస్
నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమాను నిర్మించిన కూడా ఆ సినిమా మంచి బిజినెస్ జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఒకవైపు నిర్మాతగానే కొనసాగుతున్న దిల్ రాజు మరొకవైపు డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి లాభాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇటీవల రాధే శ్యామ్ సినిమా భారీ ధరకు కొనుగోలు చేసి నైజాంలో విడుదల చేశారు.

దెబ్బకొట్టిన సినిమా
యు.వి.క్రియేషన్స్ ప్రొడక్షన్ లో రూపొందిన ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పై మొదట పాజిటివ్ బజ్ క్రియేట్ అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ లో తప్పితే ఆ తర్వాత ఈ సినిమా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చేశాడు కానీ సినిమా ఊహించిన విధంగా దెబ్బకొట్టింది. దాదాపు నైజాం ఏరియాలోనే రాధే శ్యామ్ సినిమా 15 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది.

RRR తో రికవరీ
రాధే శ్యామ్ సినిమా కొట్టిన దెబ్బకు దిల్ రాజు ఊహించని విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ముందుగానే RRR సినిమా కు సంబంధించిన నైజాం హక్కులను సొంతం చేసుకోవడంతో ఆ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. దానికి తోడు సినిమాకు తెలంగాణలో ప్రత్యేకంగా టికెట్ల రేట్లు పెంచడం కూడా బాగా కలిసొచ్చింది. దీంతో మొదట్లోనే కాకుండా వీకెండ్స్ అనంతరం కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి
Recommended Video


దిల్ రాజు ప్రాఫిట్ ఎంత?
మొత్తానికి రాధే శ్యామ్ సినిమా తో వచ్చిన నష్టాలను దిల్ రాజుకు నైజాం ఏరియా లో RRR సినిమాతో రికవరీ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. RRR సినిమా నైజాం హక్కులను దిల్ రాజు దాదాపు 70 కోట్ల పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా వారం తిరక్కుండానే ఆ పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చింది. ఇక ఈ వారం ఉగాది ఫెస్టివల్ ఉండడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా నైజాంలో 100కోట్ల షేర్ సాధించే అవకాశం ఉందట. అంటే సినిమాతో తో దిల్ రాజు 25 నుంచి 30 కోట్ల వరకు లాభాలు అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











