‘మరోచరిత్ర’ ఫైనల్ గా ...(ట్రేడ్ టాక్)
క్రితం వారం దిల్ రాజు 'మరోచరిత్ర" ను రీమేక్ చేసి వదిలారు. రవియాదవ్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్, అనిత, శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలగా ఈ చిత్రం రూపొందింది. అయితే ఒరిజనల్ మరో చరిత్రతో సరితూగకపోవటం ప్రక్కన పెడితే అసలు చూడటానికి కూడా ఆసక్తిలేని విధంగా ఈ చిత్రాన్ని తీయటంతో రిలీజైన మొదటి షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అలాగే తీవ్ర స్థాయిలో నిరాశనే కలిగించిన ఈ చిత్రం కలెక్షన్లు వారం తిరగకముందే పూర్తిగా పడిపోయాయి. ఇక వీటితో పాటు ఛార్మి నటించిన తమిళ డబ్బింగ్ 'ఇందు", బ్రహ్మాజీ నటించిన 'లెనిన్", త్రిష, విజయ్ నటించిన తమిళ అనువాదం 'దోపిడి" చిత్రాలు కూడా ఈ వారం రిలీజై ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకున్నాయి.
ఛార్మి ఇందు విషయానికి వస్తే చంద్రముఖి దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తమిళంలోనూ పెద్దగా వర్కవుట్ కాలేదు. చార్మీ క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో ఈ చిత్రాన్ని ధియోటర్స్ లోకి దించారు. అయితే అసలు ఛార్మికి ప్రస్తుతం అస్సలు క్రేజ్ లేదన్నది ఆమె అమ్ముడుపోని చిత్రాలు చెప్తున్నాయి. ఇక త్రిష 'దోపిడి" కూడా తమిళంలో పెద్ద ఫ్లాప్. అలాగే గతవారం చిత్రాలైన భూమిక 'యాగం", రిషి 'దమ్మున్నోడు" అసలు పత్తాలేకుండాపోతే, శివాజీ 'తాజ్‌మహల్" కలెక్షన్లు కొన్ని చోట్ల యావరేజ్ గా ఉన్నాయి. ఇక ఈ బుధవారం రిలీజైన అల్లు అర్జున్ వరుడు చిత్రం ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











