మహర్షి కలెక్షన్స్ విషయంలో సందేహం.. దిల్‌రాజు కన్ఫర్మ్ చేశారు

మహేష్ బాబు 25 వ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మహర్షి సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఎప్పటికప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో క్లారిటీ ఇస్తూనే వస్తోంది చిత్ర యూనిట్. కాగా కొందరు మాత్రం మహర్షి డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయ్యారని, చిత్ర కలెక్షన్స్ పట్ల నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

ఈ ప్రచారాలను తిప్పికొట్టేలా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో దిల్ రాజు స్పీచ్ ఆకట్టుకుంది.మహర్షి నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ''మహర్షి చిత్రం మూడోవారం పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా నాలుగోవారంలోకి ఎంటరైంది. ఇప్పటికే 100 కోట్ల షేర్‌ దాటి సూపర్‌ కలెక్షన్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది. నేను ఫస్ట్‌టైమ్‌ ఇంకో రెండు పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌లతో కలిసి పని చేయడానికి కారణం వంశీ కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జయిట్‌మెంట్‌ మాత్రమే. అదే నమ్మకంతో మహర్షి సినిమా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఒక సినిమా విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఆ సినిమా విజయవంతమైతే వచ్చే కిక్కే వేరు. అదే 'మహర్షి' ప్రూవ్‌ చేసింది. కొన్ని సినిమాలు డబ్బుతో పాటు మంచి పేరుని కూడా తెస్తాయి. అలాంటి చిత్రమే 'మహర్షి'.

 Dil Rajus clarity on Maharshi 3 week collections

ఎక్కడికెళ్ళినా మంచి ఎప్రిషియేషన్‌ వస్తోంది. ఈ సినిమా తర్వాత రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే రోజులు వచ్చాయని అదే రైతులు చెబుతుండటం మంచి శాటిస్‌ఫ్యాక్షన్‌ ఇచ్చింది. ఎంత డబ్బు వచ్చినా అది రాదు కదా. మహేష్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ షేర్‌ సాధించిన సినిమాగా 'మహర్షి' నిలిచింది. అలాగే నైజాంలో కూడా ఇంకో రెండు, మూడు రోజుల్లో 30 కోట్ల షేర్‌ను టచ్‌ చేయబోతున్నాం. ఈ సంవత్సరం సంక్రాంతికి 'ఎఫ్‌2'తో పెద్ద హిట్‌ కొట్టాం. ఇప్పుడు సమ్మర్‌లో 'మహర్షి'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించాం. ఈ రెండు సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో ఇంకో మూడు ప్రొడక్షన్స్‌తో రాబోతున్నాం. వంశీతో మా బేనర్‌లో 'బృందావనం', 'ఎవడు', 'మహర్షి'లాంటి మూడు సూపర్‌హిట్‌ మూవీస్‌ చేశాం. త్వరలోనే మళ్ళీ వంశీతో మరో సూపర్‌హిట్‌కి రెడీ అవుతున్నాం. సబ్జెక్ట్‌ రెడీ అయ్యింది. కలెక్షన్స్‌తో పాటు అందరి అప్రిషియేషన్‌ కూడా పొందే విధంగా ఆ సినిమా ఉంటుంది'' అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X