twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    F3 movie Total collections.. దిల్ రాజుకు లాభాల పంట.. అనిల్ రావిపూడి ఖాతాలో ట్రిపుల్ బ్లాక్‌బస్టర్!

    |

    టాలీవుడ్‌లో థియేట్రికల్ రిలీజ్‌తో సినిమా హాళ్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసులు పంట పండించిన చిత్రం F3. సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకొన్న F2 చిత్రానికి ఫ్రాంచైజీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. F2 మూవీలో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ F3 చిత్రం ద్వారా మరోసారి మ్యాజిక్ చేశారు. ఇక ఈ చిత్రం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌కు కాసుల పంటపడించడమే కాకుండా వారి ఖాతాలో ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌ను చేర్చింది. ఈ సినిమా గత 40 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    10 థియేటర్లలో 40 రోజులు పూర్తి

    10 థియేటర్లలో 40 రోజులు పూర్తి


    తెలుగు సినిమా పరిశ్రమలో F3 చిత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన అఖండ, RRR, KGF2 చిత్రాల తర్వాత భారీ వసూళ్లు, థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించిన సినిమా ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 10 థియేటర్లలో 40 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా 50 రోజుల పూర్తి చేసుకోవడానికి పరుగులు పెడుతున్నది.

     7 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో

    7 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో

    F3 చిత్రానికి సంబంధించి సుమారు 7 వారాల్లో కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే.. నైజాంలో ఈ చిత్రం 20 కోట్ల షేర్ రాబట్టడం ఈ సినిమాకు ఉన్న బాక్సాఫీస్ స్టామినా‌ను తెలియజేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 53.94 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. పలు చోట్ల ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతున్నది.

     ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా

    ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా


    ఇక ఏపీ, తెలంగాణలో ప్రాంతాల వారీగా కలెక్షన్లను చూస్తే.. నైజాంలో 20.57 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.48 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 4.18 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.41 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.23 కోట్లు, గుంటూరు జిల్లాలో 4.18 కోట్లు, నెల్లూరు జిల్లాలో 2.31 కోట్లు, సీడెడ్‌లో 8.58 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్లు వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?


    F3 చిత్రం గత 40 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్, 70.94 కోట్ల షేర్‌ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా విజయంపై డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు ప్రేక్షకులు రాలేని పరిస్థితిలో అనిల్ రావిపూడి అందించిన కంటెంట్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. దాని ఫలితమే ఈ చిత్రం విజయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

    F3 లాభం ఎంతంటే?

    F3 లాభం ఎంతంటే?


    F3 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్‌ను 63 కోట్లకుపైగా అంచనావేశారు. ఈ సినిమా బ్రేక్‌ఈవెన్‌ను 64 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ చిత్రం 70 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టింది. తాజాగా నమోదు చేసిన వరల్డ్ వైడ్ షేర్‌ను పరిశీలిస్తే.. క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినట్టు స్పష్టమైంది.

    English summary
    F3 has completed its 40 days run and is running towards 50 days run in these theatres. In Nizam, the movie crossed 20 Cr share mark, which is a rare feat. The film in its life-time run collected 53.94 Cr share in AP, TS and 70.94 Cr share worldwide. The worldwide gross stands at 134 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X