twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rowdy Boys day 1 collections దిల్ రాజు టార్గెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

    |

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయమవుతున్న హీరో ఆశిష్. గ్లామర్ తార అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ రౌడీ బాయ్స్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాల లేకుండా ఓ రకమైన ఆసక్తిని కలిగిస్తూ రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

    నైజాంలో బెటర్‌గా

    నైజాంలో బెటర్‌గా

    అశీష్ రెడ్డి కొత్త హీరో కావడం, అలాగే దిల్ రాజ్ సొంత బ్యానర్ కావడంతో మౌత్ టాక్‌తోనే థియేటర్లలో ఓ మోస్తార్ స్పందన లభించింది. పండుగ కావడం, అలాగే కరోనావైరస్ భయాందోళనలు నెలకొన్నడం కారణంగా రెస్పాన్స్ కరువైంది. ఆంధ్రాలో అక్యుపెన్సీ పక్కన పెడితే.. నైజాంలో కొన్ని సెంటర్లలో మంచి రెస్సాన్స్ కనిపించింది.

    యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా

    యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా

    రౌడీ బాయ్స్‌ చిత్రం కమర్షియల్, అలాగే యూత్, రొమాంటిక్, లవ్ లాంటి అంశాలతో రూపొందింది. ఆశీష్ తన తొలి చిత్రంతోనే మంచి పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడనే విషయం ప్రేక్షకుల్లో కనిపించింది. అనుపమ, ఆశీష్ మధ్య రొమాంటిక్ సీన్లు, డీఎస్పీ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌గా మారిందనే టాక్ స్ప్రెడ్ అయింది.

    12 కోట్ల విలువతో

    12 కోట్ల విలువతో


    ఇలాంటి పరిస్థితుల మధ్య రౌడీ బాయ్స్ చిత్రాన్ని దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకొన్నారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది క్లారిటీ లేకపోయింది. అయితే ఈ సినిమా విలువను 12 కోట్లుగా అంచనావేస్తున్నారు. అయితే శాటిలైట్, డిజిటల్ రైట్స్, ఇతర హక్కులను తీసేస్తే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సంపాదించాలంటే కనీసం 6 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.

    అక్యుపెన్సీ ఎలా ఉందంటే..

    అక్యుపెన్సీ ఎలా ఉందంటే..


    అయితే తొలి రోజున రౌడీబాయ్స్ చిత్రం ప్రేక్షకులను థియేటర్‌కు రాబట్టలేదనే విషయం స్పష్టమైంది. ఈ చిత్రం కేవలం 40 శాతం ఆక్యుపెన్సీతో తెలుగు రాష్ట్రాల్లో షోలు కొనసాగాయి. ఈ సినిమా వీకెండ్‌లో మంచి కలెక్షన్లు సాధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని అంచనా వేస్తున్నారు.

    తొలి రోజు ఎంతంటే?

    తొలి రోజు ఎంతంటే?

    ఇదిలా ఉంటే.. రౌడీ బాయ్స్ సినిమాకు అమెరికాలో ప్రదర్శించిన ప్రీమియర్లకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. ఓవరాల్‌‌గా ప్రీమియర్లకు 1000 నుంచి 1500 డాలర్ల వరకు కలెక్షన్లు నమోదయ్యాయి. ఒక ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి

    English summary
    Dil Raju's Rowdy Boys hits the screens on January 14th. Here are the day 1 expected collections worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X