twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థాంక్యూ సినిమాకు నష్టాలు వచ్చినా దిల్ రాజు సేఫ్.. ఇది బిజినెస్ స్ట్రాటజీ అంటే!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా లాభాలతో పాటు ముందుగానే నష్టాలు వస్తే ఎంతవరకు నిలదొక్కుకుంటాము అనే విషయాన్ని కూడా చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఆయనకు మాత్రం కొన్ని సినిమాలు ఊహించిన విధంగా చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఇక రీసెంట్ గా థాంక్యూ సినిమా కూడా మొదటి రోజు ఊహించిన విధంగా డిజాస్టర్ కలెక్షన్స్ తో మొదలయింది. అయితే ఈ సినిమాకు ద్వారా నిర్మాత దిల్ రాజు కాస్త సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    మంచి అనుభవం

    మంచి అనుభవం

    నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమాలు నిర్మించిన కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా జనాలను ఈ సినిమా ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనే విషయం కూడా చాలా జాగ్రత్తగా అంచనా వేస్తూ ఉంటారు. ఆయన సలహాలతోనే చాలామంది దర్శకులు కూడా కొన్నిసార్లు వారి బలమైన నిర్ణయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. అంతగా ఆయనకు అనుభవం ఉంది.

    బిగ్ బడ్జెట్ మూవీ

    బిగ్ బడ్జెట్ మూవీ


    మొదట డిస్ట్రిబ్యూటర్ గా మంచి లాభాలను అందుకున్న దిల్ రాజు ఆ తర్వాత ఎంతో కష్టపడే సినిమాలను నిర్మించి ఈ స్థాయికి వచ్చారు. మొత్తంగా ఇప్పటివరకు 49 సినిమాలను పూర్తి చేసిన ఆయన త్వరలోనే రామ్ చరణ్ తో 50వ సినిమాను వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమా భారీ బడ్జెట్ తో దిల్ రాజు కెరీర్ మొత్తంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతూ ఉండటం విశేషం.

    కలెక్షన్లు డౌన్

    కలెక్షన్లు డౌన్

    అయితే నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇటీవల వచ్చిన థాంక్యూ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓవర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చినప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం సినిమాకు విలన్ గా మారాయి అనే చెప్పాలి. ఒకవైపు వర్షాలు అలాగే మరొకవైపు సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తి పరచకపోవడం నెగిటివ్ రివ్యూలు రావడంతో ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి.

    థాంక్యూ నష్టాలు

    థాంక్యూ నష్టాలు

    మొదటిరోజు కనీసం ఈ సినిమా మూడు కోట్ల షేర్ అందుకోలేకపోయింది. నాగచైతన్య మొత్తంలో ఇది అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొదటి రెండు రోజుల్లో సినిమా అయితే పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు థియేట్రికల్ గా 18 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    ఆ రూట్లో ప్రాఫిట్

    ఆ రూట్లో ప్రాఫిట్


    అయితే ఒక విధంగా దిల్ రాజుకు దాదాపు 16 కోట్ల వరకు నష్టాలు కలిగినప్పటికీ కూడా మరొక రూట్లో వాటిని రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే థాంక్యూ సినిమా ఓటిటి హక్కులను రెండు సంస్థలకు అమ్మడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు సన్ NXT కూడా ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనడంతో దాదాపు 10 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. అలాగే శాటిలైట్ డబ్బింగ్ రూపంలో కూడా మరొక ఎనిమిది కోట్ల వరకు వచ్చాయట. ఏ విధంగా చూసుకున్నా దిల్ రాజు పెట్టిన పెట్టుబడిన అయితే వెనక్కి తెచ్చుకున్నట్లు సమాచారం.

    English summary
    Dil raju safe with thankyou movie after theatrical bussiness loss
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X