దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు..డేటిచ్చారు

By Srikanya

హైదరాబాద్ :తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం 'శైవం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'దాగుడుమూత దండాకోర్‌' పేరుతో పునర్నిర్మించారు. రాజేంద్రప్రసాద్‌, బేబీ సారా అర్జున్‌, సిద్ధార్థ వర్మ, నిత్యా శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్‌.కె. మలినేని దర్శకుడు. ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రామోజీరావు నిర్మాత. క్రిష్‌ సమర్పకుడిగా వ్యవహరించారు. మే 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... 'కంప్యూటర్‌ యుగంలో ఉన్నాం. అన్నింటా వేగమే. లైక్సూ, కామెంట్సూ, షేర్సూ... అంటూ ఓ ప్రపంచంలో బతికేస్తున్నాం. మన ఆటలూ.. ఆన్‌లైన్‌లోనే. బంధాలన్నీ ఫోన్లకే పరిమితం. ఈ గజిబిజి జీవితంలో ఏం సాధించాం? ఏం కోల్పోయాం? ఇవన్నీ మా కథలో చూపిస్తున్నాం' అంటున్నారు క్రిష్‌.

Dil Raju to release Daagudu Mootha Dandakor in AP and Telangana

అలాగే ''మూడేళ్ల క్రితం 'శైవం' చూశా. ఇలాంటి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనిపించింది. వెంటనే రామోజీరావుగారిని సంప్రదించాం. అలా.. 'దాగుడుమూత దండాకోర్‌' మొదలైంది. అచ్చ తెలుగు సినిమా ఇది. బంధాలు, విలువలు తెరపై కనిపిస్తాయి. రాజేంద్రప్రసాద్‌, బేబీ సారా, కోడి.. ఇలా ప్రతి పాత్రనీ ప్రేక్షకులు ప్రేమిస్తారు. ఈ సినిమాని దిల్‌రాజుగారికి చూపించాం. చూసిన వెంటనే 'ప్రపంచవ్యాప్తంగా నేనే సినిమా విడుదల చేస్తా' అని ఆయన ముందుకొచ్చారు''అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ ''క్రిష్‌ తెరకెక్కించిన 'గమ్యం' నాకు చూపించాలని, ఆ సినిమాని మా సంస్థ ద్వారా విడుదల చేయాలని చాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. గమ్యం చూశాక 'ఓ మంచి సినిమా వదులుకొన్నా' అనిపించింది. 'దాగుడుమూత దండాకోర్‌' చూశాక క్షణం కూడా ఆలస్యం చేయదలచుకోలేదు. విడుదలకు ముందే తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ప్రీమియర్‌ షోలు ఏర్పాటు చేస్తాం'' అన్నారు.

Dil Raju to release Daagudu Mootha Dandakor in AP and Telangana

దర్శకుడు మాట్లాడుతూ ''ఓ మంచి సినిమాని, కొత్త ఆలోచనని ప్రేక్షకులకు అందివ్వాలన్న తపన ఉన్న దర్శకుడు క్రిష్‌. ఆయనతో ఓ సినిమా చేద్దామని ప్రయాణం మొదలెట్టా. అంతలో 'శైవం' నాకు అప్పగించారు. చిన్న కథ ఇది. అయితే వినోదం, మానవసంబంధాలూ మేళవించి తీర్చిదిద్దిన విధానం అందరికీ నచ్చుతుంది''అన్నారు.

''చిన్న బడ్జెట్‌తో తెరకెక్కించాం.. కానీ చిన్న సినిమా మాత్రం కాదు. మీ హృదయాన్ని తాకే ఓ మంచి సినిమాగా మిగిలిపోతుంద''న్నారు లైన్‌ ప్రొడ్యూసర్‌ సుబ్రతో చౌదరి. ''మాతృక 'శైవం' కంటే భిన్నంగా, గొప్పగా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ సినిమాలో పాటల అవసరం లేదు. కానీ క్రిష్‌ తనదైన భావోద్వేగాలను ఈ చిత్రంలో జోడించడంతో పాటలూ అవసరమయ్యాయి'' అని సంగీత దర్శకుడు ఇ.ఎస్‌.మూర్తి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X