Thammudu Business: తమ్ముడు బాక్సాఫీస్ టార్గెట్ ఎంత? నితిన్ మూవీ ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి అంటే?
తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఏపీ, తెలంగాణలో జరిగిన థియేట్రికల్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
తమ్ముడు సినిమా 2023 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. నితిన్ గాయపడి విశ్రాంతి తీసుకోవడం, ఇతరత్రా కారణాల వల్ల 2024 సంవత్సరంలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం జూలై 4 తేదీకి విడుదల ముహుర్తాన్ని నిర్ణయించుకొన్నది. అయితే ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా.. కథ డిమాండ్ చేయడంతో టెక్నికల్ అంశాల విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. కేవలం ప్రొడక్షన్ కోసమే ఈ సినిమాకు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. అటవీ ప్రాంతంలో ఎక్కువగా షూట్ చేయడం వల్ల ఖర్చు పెరిగిపోయింది. ఈ సినిమాను సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేశాం అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

కెరీర్‌లో నితిన్ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నప్పటికీ.. తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులను 8.5 కోట్ల రూపాయలుగా వ్యాల్యూ కట్టారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలోని ఇతర జిల్లాల ప్రీ రిలీజ్ రైట్స్ 8.5 కోట్ల రూపాయల మేర విలువ కట్టారు. కొన్ని ఏరియాలు అమ్మడం జరిగింది. కొన్ని ఏరియాల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 20 కోట్ల మేర బిజినెస్ జరిగింది అని తెలిపారు.
ఇక తెలుగేతర రాష్టాల హక్కులు కూడా భారీ రేటు పలికాయి. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ సుమారుగా 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 50 లక్షలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ సుమారుగా 24 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 25 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. కనీసం 25 కోట్లు అయితే వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తమ్ముడు సినిమాకు కొత్త సినిమాల రిలీజ్ బెడద లేకుండా ఉండటం ఓ రకంగా కలిసి వచ్చే అంశం. అలాగే ఇప్టపికే రిలీజైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా బలంగా లేకపోవడం మరో విధంగా పాజిటివ్ అంశం. అయితే ఈ సినిమాను నైజాంలో 100 నుంచి 150 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు. అలాగే ఆంధ్రాలో 200 నుంచి 250 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 600 స్క్రీన్లలో రిలీజ్ చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
హీరో నితిన్ నటించిన గత చిత్రం రాబిన్‌హుడ్ సినిమా పూర్తిగా డిజాస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. అలాంటి టాక్‌లోను ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా 13.5 కోట్ల గ్రాస్ వసూలుచేసింది. ఇక తమ్ముడు సినిమా హిట్ టాక్ తెచ్చుకొంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సినిమా నితిన్‌కు హిట్ అందిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











