Dilruba Business: కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాలంటే? దిల్ రూబా టార్గెట్ ఎన్ని కోట్లంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం దిల్ రూబా. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది.

హోలీ పండుగ కానుకగా ఈ నెల 14న తేదీన ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్నది. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్ మంచి స్పందన రావడం సానుకూలంగా మారింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది? థియేట్రికల్ బిజినెస్ పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Dilruba Pre Release Business

సంక్రాంతి రేసులో వచ్చిన క సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమా కావడంతో దిల్ రూబా మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ వర్క్ చేయడంతో మూవీ మీడియం కంటే ఎక్కువ బడ్జెట్ మూవీగా ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈ సినిమా సుమారుగా 17 కోట్ల రూపాయల మేర బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

క విజయంతో కిరణ్ అబ్బవరం మార్కెట్ పెరగడంతో ఈ సినిమాపై బజ్ ఎక్కువగా క్రియేట్ కావడంతో థియేటర్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, నైజాంలో 550 నుంచి 600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో కలిపి దాదాపు 750 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు.

దిల్ రూబా సినిమాపై, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీలో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో వచ్చే ఆదాయంపై కమిషన్ బేస్‌పై డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.

కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను 12 కోట్లుగా వాల్యూ కట్టారు. నైజాం థియేట్రికల్ హక్కులను 4 కోట్లుగా, ఏపీ రైట్స్‌ను 5 కోట్లుగా విలువ కట్టారు. ఇక కర్నాటక 70 లక్షలు, ఓవర్సీస్ రైట్స్ 1.30 కోట్లుగా అంచనా వేశారు. దాంతో ఈ సినిమా 13 కోట్ల రూపాయలు షేర్, 26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టనున్నది. ఈ సినిమా ఏ మేరకు లాభాలను పంచుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X