Bangarraju: కృతి శెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే?.. దర్శకుడు కల్యాణ్ కృష్ణ క్లారిటీ!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ వారి స్థాయిని ఒకేఒక్క సినిమాతో ఊహించని విధంగా పెంచేసుకుంటున్నారు. ఇక పారితోషికం విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా మిగతా హీరోయిన్స్ కు పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది కృతి శెట్టి. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమె రెమ్యునరేషన్ కూడా పెరుగుతోంది. ఇక ఇటీవల బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, కృతి శెట్టి పారితోషకం పై ఒక కామెంట్ కూడా చేశాడు.

చిన్న తనం నుంచే..
ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి అంతకుముందు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ 30 అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కంటే ముందు వరకు కృతి శెట్టి ప్రైవేట్ యాడ్స్ లో కూడా నటించింది. పదేళ్ల వయసు నుంచే కృతి శెట్టి కెమెరా ముందుకు ఏదో ఒక విధంగా అలవాటు పడుతూనే ఉంది.

ఉప్పెనతో లక్కీ ఛాన్స్
అయితే కృతి శెట్టి ఉప్పెన సినిమాలో చాలా విచిత్రంగా అవకాశాన్ని అందుకుంది. అసలైతే ఉప్పెన సినిమాకు మరో తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత దర్శకుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా కృతి ఫోటోలను చూసి వెంటనే పిలిపించాడు. ఆమెను మొదటి ఆడిషన్స్ లోనే కరెక్ట్ అనిపించడంతో మొదట అనుకున్న హీరోయిన్ ని కూడా తీసేసి కృతి సెట్ చేసుకున్నారు.

ఉప్పెన కంటే ముందే..
ఒక విధంగా ఉప్పెన సినిమా ఆమెకు చాలా బాగా హెల్ప్ అయింది అని చెప్పాలి. అందంతో పాటు కాస్త రొమాంటిక్ సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటించడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఉప్పెన సినిమా విడుదల కాకముందే శ్యామ్ సింగరాయ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా బంగార్రాజు సినిమా ఆఫర్ కూడా ఉప్పెన రిలీజ్ కంటే ఒక వారం ముందే వచ్చిందట.

బంగార్రాజు రెమ్యునరేషన్ ఎంత?
మొదటి సినిమా అనంతరం శ్యామ్ సింగరాయ్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ సినిమాకు కాస్త తక్కువగానే పారితోషకం తీసుకున్న కృతి శెట్టి బంగార్రాజు సినిమాకు మాత్రం చాలా గట్టిగానే డిమాండ్ చేసిందట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఆమె దాదాపు రెండు కోట్ల వరకు అడిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

నాగలక్ష్మి పాత్రకు కృతి పర్ఫెక్ట్..
ఇక కృతి శెట్టి రెండు కోట్ల పారితోషికం తీసుకుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఇటీవల దర్శకుడు కూడా ఆమెకు భారీ స్థాయిలోనే పారితోషకం ఇచ్చినట్లుగా వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం బంగార్రాజు ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో నాగలక్ష్మి పాత్రకు కృతి పర్ఫెక్ట్ సెట్టయినట్లు చెప్పారు. ఇక ఉప్పెన సినిమా వారం రోజుల ముందే కృతి శెట్టికి బంగార్రాజు స్టోరీ గురించి చెప్పినట్లు వివరణ ఇచ్చాడు.
Recommended Video

మార్కెట్ పరంగా పారితోషికం..
మొదట సినిమా కథ చెప్పినప్పుడు ఆమె దగ్గర పారితోషికం గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఇక ఆ తర్వాత సక్సెస్ కావడంతో ఆమె అడిగినంత ఇవ్వక తప్పలేదు అని, మార్కెట్ పరంగా పారితోషికం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని కళ్యాణ్ కృష్ణ సున్నితంగా ఆమె రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ ఉప్పెన కంటే ముందే ఓకే చేసి ఉంటే కొంత రెమ్యునరేషన్ తగ్గి ఉండేది అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











