జాంబీ రెడ్డి షాకింగ్ బిజినెస్.. విడుదలకు ముందే భారీ లాభాలు .. ఇప్పుడే ఇలా ఉందంటే..
అ! సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ను సరికొత్తగా ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత కల్కి సినిమాతో కూడా డిఫరేంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అయితే అంధించలేదు. ఇక మూడవసారి నెవర్ బిఫోర్ అనే ప్రయోగంతో రాబోతున్నాడు ఈ దర్శకుడు. ఇక సినిమా ప్రీ రిలీజ్ వివరాలు బయటకు రాకముందే ఇతర బిజినెస్ లతోనే పెట్టిన పెట్టుబడికి మంచి లాభం వచ్చినట్లు సమాచారం.

మొదటిసారి జాంబీ ఫిల్మ్
టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో మొదటిసారి ఒక జాంబీ ఫిల్మ్ ను తెరకెక్కించినట్లు ప్రమోట్ చేస్తూ తప్పకుండా సినిమా ఊహాలకందని రేంజ్ లో థ్రిల్ చేస్తుందని అంటున్నారు. ఇక ఓ వర్గం ఆడియెన్స్ లో ఈ సినిమా అంచనాలనైతే పెంచేసింది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ ను అందుకుంటుందని చెప్పవచ్చు.

రిస్క్ చేయడం అంత కరెక్ట్ కాదని
ఇక సినిమా ట్రైలర్ పై కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ మొదట్లో సంక్రాంతికే వస్తుందని చెప్పారు. ఆ తరువాత ఫిబ్రవరి 5న రానున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న తరుణంలో రిస్క్ చేయడం అంత కరెక్ట్ కాదని కొంతమంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వద్దని అన్నారని అందుకే సినిమాను ఫిబ్రవరి 5న థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రశాంత్ వివరణ ఇచ్చారు.

బడ్జెట్ ఎంతంటే..
ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించగా దక్ష నగర్కర్ హీరోయిన్ గా కనిపించనుంది. సినిమాను దర్శకుడు ప్రశాంత్ వర్మ 3.3కోట్ల బడ్జెట్ తో చాలా క్వాలిటీగా తెరకెక్కించడాని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడులు మొత్తం ప్రీ రిలీజ్ తో సంబంధం లేకుండానే వచ్చేశాయి.

విడుదలకు ముందే..
హిందీ డబ్బింగ్ రైట్స్ 2.2కోట్లకు అమ్ముడుపోగా తెలుగు శాటిలైట్ రైట్స్ 2.3కోట్ల ధర పలికినట్లు సమాచారం. ఇక్కడే నిర్మాతలకు 4.5కోట్ల వరకు వచ్చాయి. ఇక డిజిటల్ మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో రెండు కోట్ల దాకా వచ్చేశాయి. నాన్ థియేట్రికల్ గా సినిమా బిజినెస్ 6.5కోట్లకు చేరుకుంది.
Recommended Video

ప్రాఫిట్స్ ఎంతంటే..
అంటే మొత్తం ప్రాఫిట్ 3.2కోట్లు. సినిమాకు ఇప్పుడే ఇంత లాభం వచ్చింది అంటే ప్రీ రిలీజ్ ద్వారా ఇంకా ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందుతాయో చూడాలి. ఇక సినిమాను కమర్షియల్ యాంగిల్ లో కామెడీ ఎలిమెంట్స్ ను కూడా గట్టిగానే జోడించినట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఎలాగైనా స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నాడు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











