SS Rajamouli 20 ఏళ్ళల్లో 11 సినిమాలు.. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే.. RRRకు ఎంత రావచ్చు?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం నెంబర్ వన్ దర్శకుడు ఎవరు అంటే.ఎస్ఎస్.రాజమౌళి అని అన్ని వర్గాల వారు చెబుతూ ఉంటారు. రాజమౌళి ఇప్పటి వరకు కమర్షియల్ గా ఏ సినిమాతో కూడా అపజయాన్ని అందుకోలేదు. ఆయన తీసిన పది సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు గత రికార్డులన్నింటినీ కూడా తిరగరాయడానికి త్రిబుల్ ఆర్ సినిమా రాబోతోంది. ఇక రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలకు పెట్టిన బడ్జెట్ ఎంత? అలాగే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది.. అనే వివరాల్లోకి వెళితే..

Recommended Video

SS Rajamouli 20 ఏళ్ళల్లో 11 సినిమాలు.. RRRకు ఎంత రావచ్చు? | Filmibeat Telugu
 స్టూడెంట్ నెంబర్ వన్

స్టూడెంట్ నెంబర్ వన్

దర్శక ధీరుడు రాజమౌళి మొదట జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా చేశాడు. ఎన్టీఆర్ కు ఇది రెండో సినిమా. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం 1.80 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా 12 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

సింహాద్రితో ఇండస్ట్రీ హిట్

సింహాద్రితో ఇండస్ట్రీ హిట్

రాజమౌళి రెండో సినిమాను కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే చేశాడు. బాలకృష్ణ కోసం సిద్ధం చేసిన సింహాద్రి కథను తన తండ్రి దగ్గర నుంచి తీసుకున్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తో చేశాడు. ఇక ఈ సినిమా ఎనిమిది కోట్ల ఖర్చుతో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 30 నుంచి 40 కోట్ల మధ్య లో కలెక్షన్స్ అందుకుని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసినట్లుగా చెబుతూ ఉంటారు.

సై.. కెరీర్ లోనే చిన్న హిట్

సై.. కెరీర్ లోనే చిన్న హిట్

ఇక 2004లో యువ హీరో నితిన్ తో సై అనే సినిమాను చేసిన రాజమౌళి చాలా కొత్తగా ప్రయత్నం చేశాడు. రగ్బి ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేయగా బాక్సాఫీస్ వద్ద 13 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి కెరీర్లో పెట్టిన పెట్టుబడికి అతి తక్కువ ప్రాఫిట్స్ అందించిన సినిమా కేవలం సై మాత్రమే.

ప్రభాస్ తో బిగ్ హిట్

ప్రభాస్ తో బిగ్ హిట్

ఇక ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన మొట్టమొదటి సినిమా చత్రపతి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా కోసం ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేయగా బాక్సాఫీస్ వద్ద 24కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది.

విక్రమార్కుడు

విక్రమార్కుడు

ఇక ఆ తర్వాత 2006లో పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్న విక్రమార్కుడు సినిమాను రాజమౌళి చివరికి రవితేజతో చేయాల్సి వచ్చింది. ఈ సినిమా 11 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా బాక్సాపీస్ వద్ద 20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో రాజమౌళిపై తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా అగ్ర దర్శకుడిగా మారిపోయాడు.

యమదొంగ.. ఎన్టీఆర్ తో హ్యాట్రిక్

యమదొంగ.. ఎన్టీఆర్ తో హ్యాట్రిక్

ఇక 2007లో వచ్చిన యమదొంగ సినిమా ఇండస్ట్రీ రికార్డులను మరోసారి తిరగరాసింది. ఈ సినిమాను రాజమౌళి కుటుంబ సభ్యులు కలిసి నిర్మించడం జరిగింది. రాజమౌళి కూడా ఈ సినిమా నిర్మాతల్లో ఒక పార్టనర్ గా ఉన్నారు. సినిమాకు 16 నుంచి 18 కోట్ల మధ్యలో ఖర్చు చేయగా బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.

మగధీరతో మరో ఇండస్ట్రీ హిట్

మగధీరతో మరో ఇండస్ట్రీ హిట్

ఇక 2009లో తెరకెక్కించిన మగధీర సినిమాతో రాజమౌళి మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. ఈ సినిమా కోసం అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యధిక స్థాయిలో బడ్జెట్ పెట్టడం జరిగింది. రామ్ చరణ్ తో చేసిన ఈ సినిమా కోసం దాదాపు 35 కోట్లు ఖర్చు చేయగా బాక్సాఫీస్ వద్ద 70 కోట్లకుపైగా లాభాలను అందుకుంది.

మర్యాద రామన్న

మర్యాద రామన్న

ఇక రాజమౌళి స్టార్ హీరోలందరిని పక్కన పెట్టి మొదటి సారి కమెడియన్ సునీల్ ను హీరోగా చేసి తీసిన మర్యాద రామన్న సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. 2010లో వచ్చిన మర్యాద రామన్న కోసం 12 కోట్లు ఖర్చు చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.

ఈగతో మరో సంచలనం

ఈగతో మరో సంచలనం

ఇక 2012లో రాజమౌళి ఈగ సినిమాతో మరొక సంచలన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాని కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదల చేశారు. 26 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 55 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

బాహుబలి.. నెంబర్ వన్ మూవీగా..

బాహుబలి.. నెంబర్ వన్ మూవీగా..

ఇక 2015లో రాజమౌళి బాహుబలి: ద బిగినింగ్ సినిమాతో సరికొత్త సంచలనం సృష్టించాడు. 180 కోట్ల తో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆ తరువాత 2017 లో వచ్చిన బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలు 250 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద 1706 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

RRR.. ఎంత రాబట్టవచ్చు?

RRR.. ఎంత రాబట్టవచ్చు?

ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ సినిమా RRR ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల ప్రకారం సినిమా రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవచ్చు అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X