twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR బడ్జెట్ 450కోట్లు కాదు.. అంతకు మించి.. ప్రొడక్షన్ ఖర్చుపై ఓపెన్‌గా వివరణ ఇచ్చిన రాజమౌళి

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్టమొదటి విజువల్ వండర్ RRR సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పై క్రియేట్ చేస్తోంది.

    దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అసలైన బడ్జెట్ గురించి కూడా రాజమౌళి మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. రాజమౌళి చెప్పిన దాన్ని బట్టి ముందుగా అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువగానే అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇద్దరు హీరోలను సమానంగా

    ఇద్దరు హీరోలను సమానంగా

    అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ద్వారా ఒక విభిన్నమైన ఫిక్షన్ కథను వెండితెరపై చూపించబోతున్న ట్లుగా రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ కూడా సమానంగా చూపించబోతున్నాడు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇద్దరి మధ్య లో పోరాట సన్నివేశాలు కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి అని కూడా తెలియజేశారు.

    ఎమోషనల్ క్యారెక్టర్స్

    ఎమోషనల్ క్యారెక్టర్స్

    సినిమా గురించి చిత్ర యూనిట్ సభ్యులు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఉరిస్తోంది. అంతేకాకుండా సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర తో పాటు హీరోయిన్ ఆలియా భట్ పాత్ర కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని వివరణ ఇచ్చారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఫైట్స్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇస్తాయి అని దర్శకుడు రాజమౌళి ప్రతి ఇంటర్వ్యూలో వివరణ ఇస్తున్నాడు.

    మొదట అనుకున్న బడ్జెట్

    మొదట అనుకున్న బడ్జెట్

    ఇక ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో మొదట అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఫస్ట్ ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య సినిమా కోసం దాదాపు నాలుగు వందల నుంచి 450 కోట్ల మధ్యలో ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లుగా వివరణ ఇచ్చారు. అసలైతే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం 400 కోట్ల వరకు సినిమాకు ఖర్చు కావచ్చని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కరోనా పరిస్థితుల ప్రభావం వలన సినిమా ప్రొడక్షన్ కాస్ట్ మరింత పెరిగింది.

    ప్రొడక్షన్ ఖర్చుపై క్లారిటీ

    ప్రొడక్షన్ ఖర్చుపై క్లారిటీ

    రీసెంట్ గా రాజమౌళి మరోసారి ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ కాస్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. మొత్తం సినిమాకు ప్రొడక్షన్ ఖర్చు 550 కోట్లు అని చెప్పుకొచ్చారు. సినిమాను చాలా గ్రాండ్ గా వెండితెరపైకి తీసుకురావాలి అని ప్రొడక్షన్ ఖర్చు విషయంలో నిర్మాత ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి లాభాలను అందిస్తుంది అని ప్రస్తుతం సినిమా పై పెరుగుతున్న బజ్ చూస్తుంటేనే అర్థమవుతోంది.

    Recommended Video

    RRR Movie : Ram Charan, Jr NTR Tamil Dialogues Made Audience Crazy | Filmibeat Telugu
    చాలావరకు రికవరీ అయ్యిందని..

    చాలావరకు రికవరీ అయ్యిందని..

    అంతేకాకుండా సినిమా బిజినెస్ ద్వారా ఇప్పటికే చాలావరకు రికవరీ అయినట్లు కూడా దర్శకుడు రాజమౌళి మరొక వివరణ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 900 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా అప్పట్లో అయితే టాక్ గట్టిగానే వచ్చింది. కానీ కరోనా కారణంగా మళ్ళీ వాయిదా పడగా ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ కొంత తగ్గిన విషయం తెలిసిందే. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే RRR సినిమా 250 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం. మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.

    English summary
    Director SS Rajamouli clarifications on RRR movie budget production cost details..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X