Happy Birthday Rajamouli: ఫస్ట్ సినిమా నుంచి RRR వరకు.. 12 సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా చాలా గ్రాండ్ గా ఉండే విధంగానే ఆలోచిస్తాడు. ఇక నేడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అతని సినిమాలకు సంబంధించిన అనేక విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఇప్పటివరకు జక్కన్న మొత్తంగా 12 సినిమాలకు డైరెక్షన్ చేశాడు. ఇక మొదటి సినిమా నుంచి చూసుకుంటే అందులో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే...

ఎన్టీఆర్ తో బ్యాక్ టూ బ్యాక్

ఎన్టీఆర్ తో బ్యాక్ టూ బ్యాక్


జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తోనే రాజమౌళి ప్రయాణం మొదలైంది. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా మూడు కోట్ల బడ్జెట్లో తెరపైకి తీసుకురాగా బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ 2003లో జూనియర్ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా చేసిన రాజమౌళి 13 కోట్ల బడ్జెట్లో ఆ సినిమాను తెరపైకి తీసుకురాగా అది 26 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

రాజమౌళి కెరీర్ లో అతి తక్కువగా

రాజమౌళి కెరీర్ లో అతి తక్కువగా

రాజమౌళి నితిన్ తో చేసిన ఒకే ఒక్క సినిమా సై. ఈ సినిమా ఒక విధంగా రాజమౌళి కెరీర్ లోనే పెట్టిన పెట్టుబడికి కాస్త అతి తక్కువ ప్రాఫిట్ అందించిన సినిమా అని చెప్పవచ్చు. అప్పట్లో అయితే ఈ సినిమాకు యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయని కూడా టాక్ వచ్చింది. ఇక మొత్తంగా ఈ సినిమాకు ఐదు నుంచి 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

 ఛత్రపతి, విక్రమార్కుడు

ఛత్రపతి, విక్రమార్కుడు


ప్రభాస్ తో రాజమౌళి చేసిన మొదటి సినిమా చత్రపతి. దీనికి 13 కోట్ల వరకు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల వరకు లాభాలను అందించింది. ఇక ఆ తర్వాత రవితేజతో చేసిన విక్రమార్కుడు సినిమా 11 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల వరకు రెవెన్యూ సాధించింది.

 యమదొంగ, మగధీర

యమదొంగ, మగధీర

ఇక తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన మూడవ సినిమా యమదొంగ. అప్పట్లో తెలుగులో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాకు 18 కోట్ల వరకు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 28 కోట్ల వరకు ప్రాఫిట్స్ అయితే అందించింది. ఇక ఆ ధైర్యంతోనే మగధీర సినిమాను 48 కోట్ల భారీ బడ్జెట్లో తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

మర్యాదరమన్న, ఈగ

మర్యాదరమన్న, ఈగ


ఇక మగధీర సినిమా తర్వాత చిన్న బడ్జెట్లో సినిమా చేయాలి అని రాజమౌళి హీరో సునీల్ తో మర్యాద రామన్న అనే సినిమా చేశాడు. ఈ సినిమాను 14 కోట్ల బడ్జెట్లో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 29 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక తర్వాత మరో చిన్న సినిమా చేయాలి అని మొదలుపెట్టి ఈగ సినిమాను కూడా బిగ్ మూవీ తెరపైకి తీసుకువచ్చారు. ఈగ సినిమా కోసం 26 కోట్ల వరకు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 42.3 కోట్లు కలెక్ట్ చేసింది.

బాహుబలి లాభాలు

బాహుబలి లాభాలు

ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఫస్ట్ పార్ట్ 136 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక సెకండ్ పార్ట్ 2017 లోపేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం 250 కోట్లు ఖర్చు చేయగా బాక్సాఫీస్ వద్ద 1917 కోట్లు అందుకుంది.

RRR తో మరో హిట్

RRR తో మరో హిట్


ఇక రాజమౌళి, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన మల్టీస్టారర్ సినిమా RRR. ఈ సినిమా కోసం దాదాపు 450 కోట్ల వరకు ఖర్చు చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 1152 కోట్ల వరకు గ్రాడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం మిగతా దేశాల్లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ అయితే అందుకుంటుంది. ఇక నెక్స్ట్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో జక్కన్న ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X