twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa 2: రాజమౌళి తరువాత సుకుమార్ టాప్ రెమ్యునరేషన్.. అలా జరిగితే అంతకంటే ఎక్కువే..

    |

    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమాను ఫస్ట్ పార్ట్ కంటే భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో అసలు పనులు మొదలయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. అయితే ఈ సినిమాకు సుకుమార్ తన కెరీర్ లోనే అత్యధిక పారితోషికం అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక డీల్ ప్రకారం అయితే దాదాపు రాజమౌళి రేంజ్ లో కూడా రెమ్యునరేషన్ అందుకోవచ్చు అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    అసలు వర్క్ స్టార్ట్

    అసలు వర్క్ స్టార్ట్

    దర్శకుడు సుకుమార్ ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకువచ్చినా కూడా తనదైన శైలిలో చాలా విభిన్నంగా ప్రజెంట్ చేస్తాడు అని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న ఈ స్టార్ దర్శకుడు ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ తో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఇటీవల పూజ కార్యక్రమాలతో సినిమా పనులను మొదలుపెట్టారు.

     పక్కా ప్రణాళికతో..

    పక్కా ప్రణాళికతో..

    ఇక పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో దర్శకుడు సుకుమార్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావు. షూటింగ్ పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైం లో కూడా సుకుమార్ చివరి నిమిషం వరకు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండాల్సి వచ్చింది. అందుకే ఈసారి ముందే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్స్ లో కూడా బిజీగా పాల్గొనాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా హిందీలో సినిమాలు భారీగా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నారు.

    సుకుమార్ రైటింగ్స్

    సుకుమార్ రైటింగ్స్

    అయితే ఈసారి పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో ఒక మార్పు చోటు చేసుకుంది. ఫస్ట్ పార్ట్ తెరపైకి తీసుకు వచ్చినప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో పాటు అల్లు అర్జున్ బంధువుల వారి ముత్తం శెట్టి ప్రొడక్షన్ కూడా భాగమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ముత్తం శెట్టి వారు సినిమాలో భాగం కాలేదు. ఈసారి సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా జాయిన్ అయినట్లుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

    పుష్ప 2 రెమ్యునరేషన్

    పుష్ప 2 రెమ్యునరేషన్

    ఇక పుష్ప సెకండ్ పార్ట్ ద్వారా పారితోషికాలు కూడా ఎక్కువగానే పెరగబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో నటించిన వారు అలాగే టెక్నీషియన్స్ అందరు కూడా రెమ్యునరేషన్స్ లో మొదటి పార్ట్ కంటే ఎక్కువగానే రాబోతున్నాయి. ఇక ముఖ్యంగా సుకుమార్ అయితే ఈ సినిమాకు గాను దాదాపు 50 కోట్ల వరకు పారితోషికం అందుకో బోతున్నట్లు సమాచారం. ఒక విధంగా దర్శకులలో ఇది రాజమౌళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పవచ్చు.

    సక్సెస్ అయితే.. రాజమౌళి రేంజ్

    సక్సెస్ అయితే.. రాజమౌళి రేంజ్

    అయితే కేవలం పారితోషికం మాత్రమే కాకుండా సినిమా లో భాగస్వామి గా కూడా కొనసాగుతున్నారు కాబట్టి సుకుమార్ సినిమా సక్సెస్ అయితే మాత్రం అంత కంటే హై రేంజ్ లోనే ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంది. దర్శకుడు రాజమౌళి తన ప్రతి సినిమాకు లాభాల్లో వాటా అందుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఆయన 100 కోట్ల వరకు షేర్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు సుకుమార్ పుష్ప సినిమాతో 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నా కూడా దాదాపు అదే రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    director sukumar solid remuneration for pushpa 2 project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X