Balagam 11 Days Collections: బలగం మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. భారీగా పడిపోయిన వసూళ్లు.. లాభం మాత్రం!
ప్రముఖు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి ఆయన తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). కమెడియన్ ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది.
మార్చి 3న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే మంచి కలెక్షన్స్ రాబడుతోంది బలగం మూవీ. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి 11వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

జై సినిమాతో..
హీరో నవదీప్ నటించిన జై సినిమాతో హాస్య నటుడిగా సినీ ప్రయాణం మొదలు పెట్టాడు ఎల్దండి వేణు. ఆ తర్వాత ప్రభాస్ మున్నా సినిమాతో టిల్లు వేణుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు చిత్రాలతో ఆకట్టుకున్న వేణు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా చాలా పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా తర్వాత టీం లీడర్ గా చేసిన వేణు ఎల్దండి దర్శకుడిని చేసిన చిత్రం బలగం.

ప్రీ రిలీజ్ బిజినెస్..
ఇటీవల కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చిన చిత్రం బలగం. ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్, సీనియర్ నటి రోహిణి, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. టిల్లు వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరిట దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు మొత్తంగా రూ. 1.15 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

11వ రోజు ఎంతంటే..
కమెడియన్ గా మంచి పేరు సంపాదించున్న వేణు ఎల్దండి ఎన్నో చిత్రాల్లో అడపాదడపా నటిస్తు వస్తున్నాడు. తాజాగా దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టి తొలి అడుగుగా బలగం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ లభిస్తోంది. దీంతో కలెక్షన్స్ కూడా బాగుంటున్నాయి. ఈ క్రమంలో బలగం చిత్రానికి 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లోని నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 67 లక్షల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.

11 రోజుల్లో వచ్చింది..
బలగం చిత్రాన్ని పూర్తిగా ఒకే ఊరిలో పది రోజుల వ్యవధిలో చిత్రీకరించారు. అయినా సినిమాకు మంచి రిచ్ లుక్ వచ్చేలా రూపొందించారు మేకర్స్. చిన్న బడ్జెట్ లో ఒక చక్కటి చిత్రాన్ని నిర్మించారని టాక్ వస్తోంది. బలగం చిత్రానికి విజువల్స్ అన్ని రిచ్ లుక్ లో ఉన్నాయి. ఇక సినిమా మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకోగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. బలగం చిత్రానికి 11 రోజుల్లో నైజాంలో రూ. 7.41 కోట్లు, ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 4.77 కోట్లు వచ్చాయి. ఇక మొత్తంగా అంతా కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 12.18 కోట్ల గ్రాస్, రూ. 5.58 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..
టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ కావ్య కల్యాణ్ రామ్ తొలిసారి జంటగా నటించిన బలగం చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రానికి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.18 కోట్ల గ్రాస్ రాగా.. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలిపి రూ. 24 లక్షలు వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దిల్ రాజు నిర్మాణ చిత్రం బలగంకి 11 రోజుల్లో రూ. 12.42 కోట్లు గ్రాస్, రూ. 5.70 కోట్ల షేర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

ప్రాఫిట్ ఎంతంటే..
ఫ్యామిలీ ఎమోషన్స్, పిట్టకు పెట్టుడు వంటి తెలుగు సాంప్రదాయమైన కాన్సెప్ట్ తో వచ్చిన బలగం చిత్రానికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు రూ. 1.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ. 1.30 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమా 11 రోజుల్లో రూ. 5.70 కోట్లు రాబట్టగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని రూ. 4.40 కోట్ల లాభం సొంతం చేసుకుంది.
దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైరెక్టర్ గా వేణు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే అని అర్థమవుతోంది. అయితే ఆదివారం రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.36 కోట్ల గ్రాస్ రాగా సోమవారం నాడు రూ. 67 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ అయింది. అంటే ఈ సినిమాకు సోమవారం ఎఫెక్ట్ బాగానే పడి వసూళ్లు తగ్గినట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











